రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం లైగర్. స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల దగ్గర పడుతుండటంతో ప్రచార కార్యక్రమాలను మమ్మురం చేశారు చిత్ర బృందం.
తాజాగా ఈ రోజు ఉదయం ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమా ట్రైలర్ ను హైదరాబాద్ లోని సుదర్శన్ థియేటర్ లో రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. ఈ కార్యక్రమంలో హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ అనన్య పాండే, దర్శకుడు పూరి జగన్నాథ్ మరియు నిర్మాత కరణ్ జోహార్, ఛార్మీ కౌర్ (లైగర్ మూవీ టీం) తో పాటుగా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
అయితే ట్రైలర్ రిలీజ్ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.విజయ్ మాట్లాడుతూ.. రెండేళ్లు అయ్యింది నా సినిమా రిలీజ్ అయ్యి, నా చివరి చిత్రం పెద్దగా చెప్పుకునే సినిమా కూడా కాదు. ఇన్ని రోజుల తర్వాత వస్తుంటే ట్రైలర్ కు ఈ రచ్చ ఏందిరయ్యా.. అన్నారు విజయ్. అలాగే లైగర్ చిత్రాన్ని తన అభిమానులకు అంకితం ఇస్తున్నట్లు ఆయన బావోద్వేగంగా మాట్లాడారు.అలాగే తనకి డాన్స్ అంటే చిరాకు అని, అయినా కేవలం అభిమానుల కోసం చేశానని ఆయన అన్నారు. రేపు మా మావాళ్లు గర్వంగా చెప్పుకోవాలి అనే భావనతోనే డాన్స్ చేశానని అన్నారు. ఇక ఆగస్టు 25న లైగర్ రిలీజ్ అయ్యాక ఇండియా షేక్ అవడం పక్కా. అప్పుడు కూడా ఇదే రేంజ్ లో సెలబ్రేషన్స్ జరుపుకుందాం అని విజయ్ అభిమానులను ఉద్దేశించి అన్నారు. ఈ క్రమంలో సినిమా ట్రెయిలర్ లో లాగే నత్తితో మాట్లాడుతూ ఐ లవ్ యూ అని చెప్పారు విజయ్. అదేవిధంగా 25న ‘ఆగ్ లాగా దేంగే’ అన్నారు విజయ్ .ఈ సినిమాకి ప్రమోషన్స్ చేయడం లేదు అన్నారు కానీ పూరిగారి స్టైల్ లో చెప్పాలంటే.. ఇప్పుడు బుల్లెట్ దిగిందా లేదా..? అని పోకిరి సినిమా డైలాగ్ కూడా చెప్పారు విజయ్.
ఇక దర్శకుడు పూరి జగన్నాథ్ మాట్లాడుతూ.. విజయ్ దేవరకొండ భారత సినీ చరిత్రలో పెద్ద స్టార్ అవుతాడు అని చెప్పారు. అలాగే నిర్మాత కరణ్ జోహార్ ను ఇక్కడకి పిలుచుకు వచ్చింది కేవలం ట్రైలర్ లాంచ్ కోసం కాదని, మన తెలుగు వాళ్ళ సినిమా పిచ్చి, అభిమానం ఎలా ఉంటుందో చూపించడానికి అని పూరి జగన్నాథ్ చెప్పారు.