Homeసినిమా వార్తలులైగర్ ప్రి రిలీజ్ బిజినెస్: రికార్డు స్థాయిలో బిజినెస్ జరుపుకున్న లైగర్

లైగర్ ప్రి రిలీజ్ బిజినెస్: రికార్డు స్థాయిలో బిజినెస్ జరుపుకున్న లైగర్

- Advertisement -

క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, లేటెస్ట్ సెన్సెషన్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో వస్తున్న లైగర్ చిత్రం విడుదలకు ముందే సంచలనం సృష్టిస్తుంది. కేవలం ట్రైలర్ లాంచ్ నే ఒక విజయ సభ స్థాయిలో జరుపుకున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.

లైగర్ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ ఏ స్థాయిలో జరుగుతున్నదంటే..లైగర్ థియేట్రికల్ ప్రి రిలీజ్ బిజినెస్ రికార్డు స్థాయిలో జరిగింది. ఆంధ్ర ప్రదేశ్ మరియు నైజాం హక్కులు ఏకంగా 72 కోట్ల మేరకు జరిగిందని ట్రేడ్ వర్గాల సమాచారం. ఇది అసలు టైర్ 2 హీరోల లీగ్ లోనే అల్ టైం రికార్డ్ గా చెప్పుకోవచ్చు.

ఇక ఉత్తరాదిలో హిందీ వెర్షన్ తాలూకు హక్కులు కూడా భారీ రేటుకే అమ్ముడు పోయాయని తెలుస్తోంది. ఈ సినిమా హిందీ హక్కులు 25 కోట్ల వరకూ అమ్ముడు పోయిందని ట్రేడ్ వర్గాల భోగట్టా. విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ కెరీర్‌ లోనే ఈ బిజినెస్ ఓ రికార్డుగా అనుకోవచ్చు. ఈ సినిమాకి జరుగుతున్న బిజినెస్ చూసి ట్రేడ్ వర్గాలతో పాటు ఇండస్ట్రీ వర్గాలు కూడా షాక్ అయ్యాయట.

READ  RRR Movie: ఇప్పటికీ తగ్గని ఆర్ ఆర్ ఆర్ హవా

ఇక మిగతా దక్షిణ రాష్ట్రాలైన కర్ణాటక, తమిళ నాడు మరియు కేరళ హక్కులు కలిపి దాదాపు 15 కోట్లకు అమ్ముడవగా, ఆ పైన ఓవర్సీస్ హక్కులు 10 కోట్లకు అమ్ముడుపోయాయి. దీంతో ఈ సినిమా ఓవరాల్‌ బిజినెస్ 100 కోట్ల మ్యాజిక్ ఫిగర్ గా నమోదైంది. ఇదీ ఒక రికార్డుగా చెప్పుకుంటున్నారు.

ఇక లైగర్ ఓటీటీకి సంబంధించిన హక్కులు కూడా భారీ రేట్లకు ఒప్పందం జరిగినట్లు తెలుస్తోంది.ఈ సినిమా డిజిటిల్ రైట్స్‌ను 65 కోట్ల భారీ ధరకు డిస్నీ+హాట్‌స్టార్ దక్కించుకుందట. ప్యాన్ ఇండియా సినిమాగా రూపొందిన ఈ చిత్రం యొక్క హక్కులు రికార్డు స్థాయిలో అమ్ముడు పోవడం ప్రస్తుతం ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇక శాటిలైట్ హక్కులను తెలుగు టివిలో టాప్ ఛానెల్ గా ఉన్న స్టార్ మా సొంతం చేసుకున్నట్లు సమచారం.

భారీ స్థాయిలో ప్రి రిలీజ్ బిజినెస్ జరుపుకున్న లైగర్ సినిమా బ్రేక్ ఈవెన్ అయి బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ గా నిలవాలి అంటే దాదాపు 200 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించాల్సి ఉంటుంది. ఇది చాలా పెద్ద లక్ష్యం అయినా, ఈ సినిమాపై భారీ అంచనాలు మరియు క్రేజ్ ఉండటం, అలాగే ప్యాన్ ఇండియా రిలీజ్ కానుండటం వల్ల ఓపెనింగ్స్ అదిరిపోతాయి. ఆ పైన లాంగ్ రన్ రావాలి అంటే టాక్ బాగుండాలి. ఆగస్ట్ 25న విడుదల కాబోతున్న ఈ సినిమా.విడుదల తరువాత ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.

Follow on Google News Follow on Whatsapp

READ  సీక్వెల్ తో రాబోతున్న డీజే టిల్లు


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories