పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, చక్కని అభిరుచి గల దర్శకుడిగా పరిశ్రమలో పేరు గాంచిన క్రిష్ జాగర్లమూడి రూపొందిస్తోన్న భారీ చిత్రం ‘హరి హర వీరమల్లు’. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్‌తో ఈ సినిమాపై అభిమానులు మరియు ప్రేక్షకుల అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. గౌతమి పుత్ర శాతకర్ణి, మణికర్ణికా లాంటి చారిత్రక సినిమాలు చేసిన అనుభవం క్రిష్ కు ఉన్నందున, మరోసారి ఆ నేపథ్యంలో తీస్తున్న సినిమా ఇదే కావడంతో అభిమానులు కూడా ఈ సినిమా మీద ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు.
హరి హర వీరమల్లు ఇప్పటికే కొంత భాగం షూటింగ్ పూర్తి చేసుకుంది. అయితే మధ్యలో కోవిద్ వేవ్ ల వల్ల, కథలో మరియు నటీనటుల మార్పు వల్ల ఈ సినిమా షూటింగ్ లో జాప్యం పెరిగి దానికంటే ముందుగా భీమ్లా నాయక్ విడుదలయింది.
అయితే ఈ చిత్రం షూటింగ్ మధ్యలో కొన్ని కారణాల వలన ఆగిపోయింది. దానికి పలు రకాల పుకార్లు మరియు వార్తలు వినిపించాయి. పవన్ కళ్యాణ్ రాజకీయ షెడ్యూల్ ల వల్ల ఆగిపోయిందని, లేదు సినిమా బడ్జెట్ ప్రాబ్లెమ్ ల వల్ల అని రకరకాల వార్తలు వచ్చాయి. అయితే ప్రస్తుతం అన్ని సమస్యలు తీరిపోయి హారి హర వీరమల్లు చిత్రం షూటింగ్ ను ప్రారంభిస్తున్నారని తెలుస్తుంది.
ఈ చిత్ర షూటింగ్ పనులను ఆగస్టు రెండో వారంలో తిరిగి మొదలు పెడుతున్నారు అని సమాచారం. అక్టోబర్ నుండి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పనుల్లో బిజీ అవుతారు కాబట్టి ఆ లోగా సింగిల్ షెడ్యూల్ లో పవన్ కు సంబందించిన సన్నివేశాలు అన్నీ షూట్ చేయడానికి చిత్ర బృందం నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నటించే హీరోయిన్ గా నిధి అగర్వాల్ ను ఎంచుకున్నారు చిత్ర యూనిట్. కాగా.. ఇందులో మరో హీరోయిన్ పాత్ర కూడా ఉంది. ఈ పాత్ర కోసం ముందుగా జాక్వెలిన్ ను ఎంపిక చేసుకున్నారు. కానీ జాక్వెలిన్ మనీ లాండరింగ్ కేసులో ఇరుక్కకోవడంతో చిత్ర యూనిట్ ఆమె స్థానంలో మరో బాలీవుడ్ నటి నర్గీస్ ఫక్రీ ను ఎంచుకున్నట్లు సమాచారం. అలాగే ఈ చిత్రంలో మరో ముఖ్య పాత్రలో బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ నటిస్తుండటం విశేషం.