కేజీయఫ్ చాప్టర్ 2′ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బ్లాక్ బస్టర్ సినిమాగా నిలిచిన ‘కేజీఎఫ్’ పార్ట్ 1 కుకొనసాగింపుగా వచ్చిన ఈ భారీ యాక్షన్ సినిమా.. పాత రికార్డులన్నీటినీ బద్దలు కొట్టి సరికొత్త రికార్డులను నమోదు చేసింది. ఇటివలే ఈ చిత్రం విడుదలై 100 రోజులు పూర్తి చేసుకుంది.
కేజీయఫ్ 2′ సినిమా థియేట్రికల్ రన్ లో ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం రూ. 1200 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు తెలుస్తోంది. మొత్తంగా 2022లో అత్యధిక గ్రాస్ కలెక్షన్లను సాధించిన సినిమాగా ‘కేజీఎఫ్ 2’ నిలిచింది. అంతేకాదు ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక వసూళ్లు రాబట్టిన మూడో భారతీయ సినిమాగా రికార్డు సృష్టించడం మరో విశేషం. ఈ జాబితాలో ‘దంగల్’ సినిమా మొదటి స్థానంలో ఉంటే.. రెండో స్థానంలో మన ‘బాహుబలి 2’ చిత్రం ఉంది.
ఇక భారత దేశంలో అన్ని వెర్షన్లు కలిపి ‘KGF 2’ సినిమా దాదాపు రూ. 1000 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఓవర్ సీస్ లెక్కలను మినహాయిస్తే ఇక హిందీ మార్కెట్ లో ‘దంగల్’ వంటి చిత్రాన్ని అదిగమించి నార్త్ ఇండియాలో బాహుబలి 2 తరువాత రెండో స్థానంలో నిలిచింది .. ఓవరాల్ గా ఆర్ ఆర్ ఆర్ సినిమా కలెక్షన్స్ ను అధిగమించిందీ కన్నడ సినిమా, రాబోయే రోజుల్లో ‘KGF 2’ రికార్డులను వేరే సినిమాలు కొల్లగొట్టడం అంత తేలికైన విషయం ఏమీ కాదు.
తాజాగా కేజియఫ్ -2 ఖాతాలో మరో రికార్డు చేరింది. అదేంటంటే భారత దేశంలో మల్టీప్లెక్సులలో అతి పెద్ద సంస్థ అయిన పీవీఆర్ సంభందించిన థియేటర్లలో 124 కోట్ల నెట్ కలెక్ట్ చేసి ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ వరుసలో రెండో చిత్రంగా “ఆర్ ఆర్ ఆర్” 93.7 కోట్ల నెట్ కలెక్ట్ చేసింది. ఈ విషయాన్ని పీవీఆర్ పెట్టుబడిదారుల త్రైమాసిక సమావేశంలో తెలియజేశారు.
కేజీయఫ్’ చిత్రానికి కొనసాగింపుగా తెరకెక్కిన ”కేజీయఫ్ 2” చిత్రంలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించింది. బాలీవుడ్ స్టార్స్ సంజయ్ దత్ – రవీనా టాండన్ కీలక పాత్రలు పోషించారు. అర్చన జాయిస్ – ప్రకాష్ రాజ్ – రావు రమేష్ – ఈశ్వరీ రావు తదితరులు ఇతర పాత్రల్లో కనిపించారు.
హోంబలే ఫిలింస్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ ఈ పాన్ ఇండియా చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించారు. రవి బస్రుర్ దీనికి సంగీతం సమకూర్చారు. భువన్ గౌడ సినిమాటోగ్రఫీ నిర్వహించగా.. ఉజ్వల్ కులకర్ణి ఎడిటింగ్ వర్క్ చేశారు. ‘కేజీఎఫ్ 2’ చిత్రాన్ని తెలుగులో వారాహి చలన చిత్ర సంస్థ విడుదల చేసింది.