Homeసినిమా వార్తలుమరింత ఆలస్యంగా రానున్న మహేష్ - త్రివిక్రమ్ సినిమా

మరింత ఆలస్యంగా రానున్న మహేష్ – త్రివిక్రమ్ సినిమా

- Advertisement -

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్.. సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో సినిమాని అధికారికంగా గత ఏడాది మహేష్ పుట్టినరోజు నాడు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటివరకూ సినిమాకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాలేదు.మే నెలలో ఈ సినిమాకి సంబంధించి పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లో జరగగా, ఆ సమయంలో జూన్ నెలలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది అని పేర్కొన్నారు.

ఇక అదే సమయంలో మహేష్ బాబు ..“సర్కారు వారి పాట” ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా అభిమానులకు లెటర్ రాస్తూ.. జూన్ నెల నుండి త్రివిక్రమ్ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తున్నట్లు తెలపడం జరిగింది.అయితే జూన్ నెల దాటి జూలై వచ్చేసింది. మరో పక్క సినిమా ఊసే లేదు. దీంతో ఎప్పుడు షూటింగ్ మొదలు అవుతుంది..అసలు సినిమా ఉంటుందా లేదా అన్న అనుమానంతో మహేష్ అభిమానులు ఉన్నారు.

ఇదిలా ఉంటే అసలు సినిమా ఆలస్యం రావడానికి కారణాలు ఒకటీ రెండూ కాదు చాలా ఉన్నాయి అని ఇండస్ట్రీ వర్గాల భోగట్టా. నిజానికి సినిమాకి సంభందించిన కథే ఇంక ఒక కొలిక్కి రాలేదు అని వినిపిస్తుంది. మహేష్ – త్రివిక్రమ్ ల మధ్య స్క్రిప్ట్ కు సంభందించిన చర్చలు ఇంకా జరుగుతూ ఉన్నాయి అని, ఇప్పటిదాకా వినిపించిన కథల్లో ఇంకా ఏదీ ఫైనల్ అవ్వలేదని తెలుస్తుంది.

READ  డిజాస్టర్ వైపు అడుగులేస్తున్న సుందరం

అందువల్లే ఇతర నటీనటుల ఎంపిక కానీ, ప్రి ప్రొడక్షన్ పనులు కానీ ఏవీ మొదలు పెట్టలేదు అని సమాచారం.ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో నటించనున్నారు అని పలు కన్నడ, మలయాళ నటుల పేర్లు వినిపించినా ఇంకా ఏదీ అధికారికంగా చిత్ర బృందం ప్రకటించలేదు. కేవలం హీరో మహేష్, దర్శకుడు త్రివిక్రమ్,హీరోయిన్ పూజా హెగ్డే,సంగీత దర్శకుడు తమన్ మాత్రమే ఇప్పటికి ఈ సినిమాలో సభ్యులుగా చెప్పుకోవచ్చు.

మహేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో గతంలో అతడు, ఖలేజా వచ్చాయి. అతడు సూపర్ హిట్ అవగా.. ఖలేజా బాక్స్ ఆఫీస్ వద్ద నిరాశపరిచినా, నటన పరంగా మహేష్ కు ఎంతో పేరు సంపాదించి పెట్టింది. దీంతో రాబోతున్న మూడో సినిమాలో మహేష్ ను త్రివిక్రమ్ మరోసారి అద్భుతమైన పాత్రలో చూపిస్తారని మహేష్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

Follow on Google News Follow on Whatsapp

READ  రూల్స్ రంజన్ తో రాధిక


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories