తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర నిర్మాత దిల్ రాజు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు..స్క్రిప్ట్ ల పై ఆయన జడ్జిమెంట్ గురించి ఇండస్ట్రీ వర్గాల్లో మంచి పేరు ఉంది. ప్రేక్షకులు ఎలాంటి సినిమాలు ఇష్టపడతారో ఆయనకు బాగా తెలుసు. ఆ విషయం ఆయన బ్యానర్ లో ఉన్న హిట్ సినిమాల సంఖ్య చూస్తేనే అర్థం అవుతుంది.
ప్రస్తుతం తెలుగు సినిమాలతో పాటు బాలీవుడ్ లోనూ వరుస సినిమాలు నిర్మిస్తూ బిజీగా వున్నారు. అలాంటి దిల్ రాజు ఇప్పడు కొన్ని విషయాల పట్ల ఆందోళనతో ఉన్నట్లు తెలుస్తోంది.
ఆయనను అంతగా ఇబ్బంది పెడుతున్న విషయం ఏంటంటే..కరోనా తరువాత గత సినిమాలు చూసే విషయంలో ప్రేక్షకుల అభిరుచి మరియు ఆలోచనా ధోరణి మారింది అన్నమాట వాస్తవం. భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రాలు అయితేనో.. లేదా అద్భుతమైన ఆడియో లేదా ప్రచారం జరిగిన సినిమాలకే థియేటర్లకు కదులుతున్నారు. ఎంత పెద్ద హీరో అయినా, క్రేజీ కాంబినషన్, భారీ నిర్మాణ సంస్థ అయినా తమను ఆకట్టుకునే అంశాలు ఉంటేనే.. ఏదో అద్భుతం దాగి ఉంది అన్న భావన కలిగితేనే ప్రేక్షకులు సినిమా చూడటానికి ఆసక్తి చూపుతున్నారు.
అందుకే ఇప్పుడు ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి నిర్మాతలు, హీరోలు, పాన్ ఇండియా చిత్రాలు లేదా ద్విభాషా చిత్రాలు నిర్మించి నిత్యం ఏదో ఒక అంశంతో ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తూ సినిమాలు విడుదల చేస్తున్నారు.
ఇదిలా ఉండగా ప్రస్తుతం పరిశ్రమ ఎదురుకుంటున్న సమస్యల గూర్చి నిర్మాత దిల్ రాజు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో చర్చించారట. సమస్యల గురించి కూలంకషంగా చర్చించిన అనంతరం రామ్ చరణ్ ఆయా విషయాలపై సానుకూలంగా స్పందించారని తెలుస్తోంది.
ఈ విషయాన్నే చెప్తూ నిర్మాత దిల్ రాజు తెలుగు సినీ స్టార్ హీరోలను పొగడ్తలతో ముంచెత్తారు. మన హీరోలు బంగారం లాంటి వారని, సరైన విధంగా సమస్యలేంటో వివరిస్తే వారు ఖచ్చితంగా వింటారని ఆయన అన్నారు.