Homeసినిమా వార్తలుSSMB28: మంత్రిగా కనిపించనున్న మహేష్

SSMB28: మంత్రిగా కనిపించనున్న మహేష్

- Advertisement -

సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తన 28వ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ఆగస్టులో మొదలు పెట్టనున్నారు అని ఇటీవలే చిత్ర బృందం తెలిపారు. అయితే సినిమా కథ ఏమయి ఉంటుంది అనే విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి వార్తా బయటకి రాలేదు. అయితే సోషల్ మీడియాలో ఈ సినిమా మీద క్రేజ్ మరియు కథా వస్తువు గురించి పుకార్లు రకరకాలుగా వినిపించాయి. ఇదిలా ఉండగా.. ఈ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయం ప్రస్తుతం సూపర్ స్టార్ అభిమానులలో చర్చనీయాంశంగా మారింది.

మహేష్ బాబు – త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో ఇదివరకే అతడు, ఖలేజా సినిమాలు వచ్చినా విషయం తెలిసిందే. 12 ఏళ్ళ తరువాత వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తున్న కారణంగా ఈ సినిమా పై అటు అభిమానుల్లో ఇటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాని గత సంవత్సరం ప్రకటించినా.. సెట్స్ పైకి వెళ్లేందుకు చాలా సమయం పట్టింది.

ఇక ఈ చిత్రం గురించి తెలియవచ్చిన ఆ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ చిత్రం రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారట. మహేష్ ఇందులో ఒక రాజకీయ నాయకుడిగా ఆ పై మంత్రిగా కనిపించబోతున్నారట.

READ  NBK-108: ఆ టైటిల్ వద్దు అంటున్న బాలయ్య

గతంలో కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన “భరత్ అనే నేను” చిత్రంలో మహేష్ బాబు ముఖ్యమంత్రిగా కనిపించిన సంగతి తెలిసిందే.మరి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రాజకీయాలపై సినిమా అంటే ఈ విధంగా ఆ సినిమా ఉంటుందో.. మహేష్ ను ఏ స్థాయిలో చూపిస్తారో అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

రాజకీయాలతో పాటు త్రివిక్రమ్ నుంచి ఆశించే ఫ్యామిలీ సన్నివేశాలు కూడా సినిమాలో ఉంటాయని సమాచారం. ఈ చిత్రంలో మహేష్ సరసన హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తుండగా.. రెండో హీరోయిన్ గా శ్రీలీల నటించే అవకాశాలు ఉన్నట్లు వార్తలు కూడా వస్తున్నాయి.

Follow on Google News Follow on Whatsapp

READ  Thank you Movie: సినిమా పబ్లిసిటీ పై నిరాశలో ఉన్న అక్కినేని అభిమానులు


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories