Homeసినిమా వార్తలుబింబిసారుడికీ సీతారాముడికీ మధ్య జరిగిన పోటీలో గెలిచిందేవరు?

బింబిసారుడికీ సీతారాముడికీ మధ్య జరిగిన పోటీలో గెలిచిందేవరు?

- Advertisement -

ఈ వారం తెలుగు సినిమా పరిశ్రమలో ఆసక్తికరమైన యుద్ధం జరగనుంది. బింబిసారుడికి మరియు సీతారాముల మధ్య ఈ యుద్ధంలో ఎవరు గెలిచారో.. రెండు చిత్రాల ప్రీమియర్ షోలకు సోషల్ మీడియాలో వస్తున్న స్పందన ఎంటో చూద్దాం.

నందమూరి కల్యాణ్‌ రామ్‌ హీరోగా మరియు నిర్మాతగా కొత్త దర్శకుడు వశిష్ఠ్‌ తెరకెక్కించిన చిత్రం బింబిసార. సంయుక్తా మీనన్‌, కేథరిన్‌లు హీరోయిన్లుగా నటించారు. సోషియో ఫాంటసీ సినిమాగా తెరకెక్కింది. ఈ చిత్రంలో కల్యాణ్‌ రామ్‌ సరికొత్త అటు బింబిసారుడిగానే కాక ఈతరం మోడర్న్ లుక్ లో కనిపించి వారెవ్వా అనిపించుకున్నారు.టీజర్ మరియు ట్రైలర్ తో ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగించిన ఈ సినిమా ఆ ఆసక్తిని థియేటర్లో కూడా నిలుపుకుంది అని సమాచారం.

అటు బింబిసారుడి గెటప్ తో పాటు ఇటు మోడర్న్ లుక్ లో కళ్యాణ్ రామ్ పెర్ఫెక్ట్ గా ఉండటంతో పాటు నటనతో కూడా ఆకట్టుకున్నారు అని ట్విట్టర్ లో అభిమానులు మరియు ప్రేక్షకులు అంటున్నారు. అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలకు తోడు కీరవాణి నేపథ్య సంగీతం సినిమాలో బాగా వచ్చాయని ప్రేక్షకులు అంటున్నారు. ఇక ఇంటర్వల్ ఎపిసోడ్ అయితే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయే విధంగా ఉందని గట్టిగా టాక్ వినిపిస్తుంది. ఈ సినిమాలో ఒక ఐటెం సాంగ్ కూడా ఉందని, ఆ పాటకు సంభందించిన ఏ ప్రోమో కానీ డీటైల్స్ కానీ బయటకి రాకుండా సినిమాలో ప్రేక్షకులని సర్ప్రైజ్ చేశారు బింబిసార చిత్ర యూనిట్.

READ  NBK-108: ఆ టైటిల్ వద్దు అంటున్న బాలయ్య

ఇక ఈరోజు విడుదలైన రెండో సినిమా మలయాళ స్టార్‌ హీరో దుల్కర్‌ సల్మాన్‌ తెలుగులో నటిస్తున్న మొదటి చిత్రం అయిన సీతా రామం. ఇందులో మృణాళ్‌ ఠాకూర్‌ హీరోయిన్ గా నటించగా.. రష్మిక మందన్న మరియు సుమంత్, తమిళ దర్శకుడు మరియు నటుడు గౌతమ్ మీనన్,తరుణ్ భాస్కర్ కీలక పాత్రలు పోషించారు.ఈ చిత్రం కూడా చక్కని అంచనాల మధ్య విడుదలైంది.

దర్శకుడు హను రాఘవపూడి తనదైన శైలిలో తెరకెక్కించినట్లు ప్రేక్షకులు అంటున్నారు. దుల్కర్ సల్మాన్ మరియు మృణాల్ ఠాకూర్ ల జంట మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా కుదిరిందని ప్రేక్షకులు అంటున్నారు. వీనులవిందైన పాటలకు తోడు ఆహ్లాదకరమైన దృశ్యాలు సినిమాని చక్కగా మలిచాయి అంటున్నారు. కథనం కాస్త నెమ్మదిగా ఉన్నా.. సినిమాలో చక్కని ఫీల్ తో సాగిందని ప్రేక్షకులు అంటున్నారు.

మొత్తానికి ఈ వారం విడుదలైన రెండు సినిమాలకి ఇలా పాజిటివ్ టాక్ రావడం ఎంతో ఆనందకరం. గత కొన్ని నెలలుగా సరైన విజయం లేని తెలుగు సినీ పరిశ్రమకి ఈ రెండు చిత్రాలు విజయం సాధించి మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావాలని కోరుకుంటూ బింబిసార, సీతారామం చిత్రాలకి ముందస్తు అభినందనలు తెలుపుదాం.

Follow on Google News Follow on Whatsapp

READ  Rashmika Mandanna: నేషనల్ క్రష్ ఖాతాలో మరో తమిళ సినిమా?


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories