‘పుష్ప: ది రైజ్’ సినిమాతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ పాన్ ఇండియా ప్రేక్షకుల్ని అద్భుతంగా అలరించారు. ప్రస్తుతం ఆ సినిమాకు సీక్వెల్ ‘పుష్ప 2’ ఎప్పుడు మొదలవుతుంది అని ప్రేక్షకులు ఆసక్తితో ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. త్వరలో ‘పుష్ప 2’ షూటింగ్ స్టార్ట్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు ‘పుష్ప’ ఫ్రాన్చైజీ కు సంబందించి ఒక ఆసక్తికరమైన విషయం తెలిసింది.
అంతగా విశేషమైన వార్త ఏమిటంటే.. “పుష్ప -3″ కూడా రాబోతుందట. ఈ విషయాన్ని మరెవరో కాదు, పుష్ప సినిమాలో భన్వర్ సింగ్ షెకావత్ రోల్ చేసిన మలయాళ హీరో ఫహాద్ ఫాజిల్ చెప్పారు. ఆయన నటించిన ” మలయన్ కుంజు” చిత్రం ఈ శుక్రవారం విడుదల కానున్న సందర్భంగా ఆయన మలయాళ మీడియాతో ముచ్చటించారు. ఆ క్రమంలో ఆయన ‘పుష్ప 3’ ప్రిపరేషన్ కోసం ఇటీవల సుకుమార్ తనతో చర్చించారని ఆయన తెలిపారు.
ఫహాద్ ఫాజిల్ చెప్పిన దాని ప్రకారం నిజంగా ‘పుష్ప 3’ ఉంటే అందులో ఆయన పాత్ర ఎలా ఉండబోతుందో? అసలు పుష్ప 2 లో అల్లు అర్జున్ కి మధ్య అతనికి మధ్య యుద్ధం ఏ స్థాయిలో ఉంటుందో చూడాలి. ఇక పుష్ప 3 లో కూడా కథానాయికగా రష్మికతో పాటు మిగతా పాత్రధారులు ఎవరై ఉంటారు అనే ప్రశ్నలకు పార్ట్ 2 విడుదలైన తర్వాత గానీ సమాధానం దొరకదు.
పుష్ప 3′ వార్త వింటే అల్లు అర్జున్ అభిమానుల ఆనందానికి హద్దే ఉండదు. పుష్ప సినిమాలో ‘తగ్గేదే లే’ అంటూ పుష్పరాజ్ చూపించిన మేనరిజమ్ ప్రపంచ వ్యాప్తంగా తెగ పాపులర్ అయ్యింది. సినీ రంగాలే కాక క్రీడా రంగాలైన క్రికెట్ వరకూ ఆ మానరిజమ్ పాకింది. ఇక పుష్ప 2 మరియు పుష్ప 3 లో ఇంకెన్ని అంశాలు ఫేమస్ అవుతాయో చూడాలి.