Homeసినిమా వార్తలుపుష్ప ఖాతాలో మరో రికార్డు

పుష్ప ఖాతాలో మరో రికార్డు

- Advertisement -

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పుష్ప’ సినిమా ప్యాన్ ఇండియా లెవల్లో సత్తా చాటిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఈ సినిమాలో బన్ని చెప్పిన ‘తగ్గేదేలే’ డైలాగ్ ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అయింది. ఇక హిందీలో జుకేగా నహీ డైలాగ్ అయితే సోషల్ మీడియాలో రీల్స్, వీడియోల రూపంలో తెగ ఫేమస్ అయింది.ఇలా భాషా భేదం లేకుండా అన్ని ఇండస్ట్రీల ప్రేక్షకులను ఆకట్టుకుని పుష్ప సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. తాజాగా ఈ సినిమా మరో రికార్డును తన ఖాతాలో జమ చేసుకుంది.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, క్రియేటివ్ జీనియస్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పుష్ప’ .. ప్యాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా గతేడాది డిసెంబర్ 17న విడుదలై బాక్స్ ఆఫీసు వద్ద రికార్డు స్థాయిలో కలెక్షన్స్‌ రాబట్టింది. ఈ సినిమాకు కలెక్షన్స్‌తో పాటు ప్రశంసలు కూడా అలాగే వచ్చాయి.

సినిమా చూసిన ప్రేక్షకులు అందరూ అల్లు అర్జున్ నటనను పెద్ద ఎత్తులో కొనియాడారు. ఇదిలా ఉంటే ఈ సినిమా మరో రికార్డు నమోదు చేసింది. ఈ సినిమా మ్యూజిక్ ఆల్బబ్ అన్ని ఏరియాల్లో కలిపి 5 బిలియన్ క్రాస్ చేసింది. అన్ని భాషల్లో కలిపి ఈ సినిమా యూట్యూబ్‌లో 500 కోట్ల వ్యూస్ రాబట్టడం విశేషం. దక్షిణాది లోనే కాదు ఏకంగా భారత దేశంలోనే ఈ స్థాయిలో యూట్యూబ్‌లో వ్యూస్ రాబట్టిన సినిమా ఏదీ లేదు. ఈ రకంగా పుష్ప సినిమాతో అల్లు అర్జున్ మరో రికార్డును నమోదు చేసారు.

READ  రాజ్యసభ సభ్యత్వానికి ఎంపికయిన వి. విజయేంద్ర ప్రసాద్.. ఇళయరాజా

తొలి సినిమా గంగోత్రి నుండి నిన్న మొన్న వచ్చిన “అలా వైకుంఠపురములో” వరకూ అల్లు అర్జున్ సినిమాలలో పాటలు బాగా ఉండడం చాలా సాధారణ విషయం. పాటలు, డాన్స్ విషయంలో అల్లు అర్జున్ తీసుకునే ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. అందువల్లే ప్రేక్షకులతో విజిల్ వేయించి స్టెప్పులు వేయించే పాటలు ఆయన సినిమాలో ఉంటాయి.

బాలీవుడ్ నటులు, ఇతర పరిశ్రమలో హీరోలు మరియు ప్రముఖులు కూడా పుష్ప సినిమాకు ప్రశంసల వర్షం కురిపించారు. హీరోయిన్ రష్మిక మందన్న కూడా ఈ సినిమా వల్ల ఎక్కడ లేని క్రేజ్ ను సంపాదించుకుంది. పుష్ప సినిమా సూపర్ హిట్ కావడంతో ఈ సినిమా రెండో భాగాన్ని మరింత భారీ స్థాయిలో తెరకెక్కించాలనే ఆలోచనలో సుకుమార్ ఉన్నట్లు తెలుస్తుంది. మొదటి భాగంతో పోలిస్తే పుష్ప 2 కోసం భారీ బడ్జెట్ కేటాయించినట్టు సమాచారం.

Follow on Google News Follow on Whatsapp

READ  Box-Office: నాని అంటే సుందరానికీతో మళ్ళీ కొట్టాడు


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories