Homeసినిమా వార్తలుపాన్ ఇండియా మల్టీ స్టారర్ సిద్ధం చేస్తున్న సుధా కొంగర

పాన్ ఇండియా మల్టీ స్టారర్ సిద్ధం చేస్తున్న సుధా కొంగర

- Advertisement -

కేజీయఫ్‌’ సిరీస్‌ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులలో మంచి గుర్తింపు తెచ్చుకుంది కన్నడ సినీ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్‌. ఈ పతాకంపై యష్ హీరోగా దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ తెరకెక్కించిన ‘కేజీయఫ్‌ 1’, ‘కేజీయఫ్‌ 2’ చిత్రాలు భారీ విజయం సాధించడంతో పాటు యావత్ భారతీయ సినీ రంగాలను, ప్రేక్షకులను ఆకర్షించాయి.

కన్నడ చిత్ర పరిశ్రమ వైపు అందరూ దృష్టి సారించెలా చేశాయి. అందువల్ల ఇప్పుడు కన్నడ పరిశ్రమలో రూపొందుతున్న సినిమాల పై కూడా అన్ని రకాల ప్రేక్షకుల ఆసక్తి నెలకొంది. మరోవైపు ‘గురు’, ‘ఆకాశం నీ హద్దురా’, ‘పావ కథైగళ్'(వెబ్​సిరీస్​)​ చిత్రాలతో ఒక్కసారిగా దక్షిణాది సినిమా పరిశ్రమ మరియు ప్రేక్షకుల ముందుకు దూసుకు వచ్చారు దర్శకురాలు సుధా కొంగర. తీసినవి కొన్ని సినిమాలే అయినా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు సుధ కొంగర. దాంతో ఆమె తదుపరి తీయబోయే కొత్త చిత్రాలు ఎమై ఉంటాయా అని ప్రేక్షకుల్లో చక్కని ఆసక్తి ఏర్పడింది.

అయితే ఇటీవలే తెలిసిన విషయం ఏమిటంటే హోంబాలే నిర్మాణ సంస్థ, దర్శకురాలు సుధ కొంగర కలిసి ప్రేక్షకులకు ఓ సరికొత్త అనుభూతి పంచేందుకు ఏకమయ్యారు. తమ కలయికలో ఓ కొత్త సినిమాను తెరకెక్కించనున్నారు. ఈ విషయాన్ని హోంబలే ఫిల్మ్స్​ సోషల్​ మీడియా లో ఇది వరకే ప్రకటించడం జరిగింది.

READ  OTT Release: విరాట పర్వం ఓటిటి రిలీజ్ ఎప్పుడంటే..

అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబందించిన మరో ఆసక్తికరమైన విషయం తెలిసింది. అదేంటంటే అద్భుతంగా వచ్చిన ఈ సినిమా స్క్రిప్ట్ లో నలుగురు హీరోలకి ప్రాధాన్యత ఉందట. అందువల్ల ఈ సినిమాలో ఒక్కో ఇండస్ట్రీ నుంచి ఒక్కో హీరోలను ఈ ప్రాజెక్ట్ లో భాగం చేసే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్లు తెలుస్తోంది. ఆ హీరోలు ఎవరూ అంటే.. ప్రస్తుతానికి తమిళ స్టార్ హీరో సూర్య, మలయాళ యువ కెరటం దుల్కర్ సల్మాన్ మరియు మన తెలుగు నుంచి నాచురల్ స్టార్ నాని ఈ సినిమాలో కలిసి ప్రేక్షకులను అలరించిననున్నారు అని సమాచారం.

ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ నడుస్తోంది కాబట్టి ఈ చిత్రానికి కూడా మంచి క్రేజ్ వస్తుంది అనడంలో ఎలాంటి అనుమానం లేదు. ఆ నాలుగో హీరో ఎవరో కూడా చిత్ర యూనిట్ ఎంపిక చేసి తొందరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆ నాలుగో హీరోగా ఎవరు ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో భాగం అవుతారో చూడాలి.

READ  డీజే టిల్లుకి డైరెక్టర్ తో లొల్లి

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories