గీతా2 ఆర్ట్స్ బ్యానర్ పై మారుతిదర్శకత్వంలో హీరో గోపీచంద్, అతని సరసన హీరోయిన్ రాశి ఖన్నా నటిస్తున్న సినిమా “పక్కా కమర్షియల్”.
ఈ సినిమా ట్రైలర్ పరంగా చూసుకుంటే హీరో క్రిమినల్స్ తరపున వాదించే లాయర్ గా కనిపిస్తున్నాడు. అవటానికి ఇది నెగటివ్ టచ్ అయినా ఇందులో బోల్డంత కామెడీ మరియు యాక్షన్ కి స్కోప్ ఉంది. దానికి తగ్గట్టే ట్రైలర్ లో విలన్ రావు రమేష్ తో పంచ్ డైలాగ్ లు, ఫైట్స్ తాలుకు షాట్స్ ఉన్నాయి ట్రైలర్ లో.
ఇక హీరోయిన్ గా రాశి ఖన్నా కూడా కామెడీ మిక్స్ ఉన్న క్యారక్టర్ లో చేలరేగిపోయినట్లు స్పష్టంగా కనిపిస్తుంది. ఇటీవలి కాలంలో మన తెలుగు సినిమాల్లో అలవాటైన నటుడు సత్యరాజ్ ఇందులో హీరో తండ్రి పాత్రలో కనిపించటం మరో విశేషం.
మారుతి కెరీర్ లో ఇంతవరకూ బాక్స్ ఆఫీస్ వద్ద ఫెయిల్ అయిన సినిమానే లేదు. ఇక “పక్కా కమర్షియల్” ట్రెయిలర్ చూస్తుంటే టైటిల్ కి తగ్గట్టే ఎక్కడా కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ అవకుండా ఒక సూపర్ హిట్ సినిమా చూడబోతున్నాము అనే ఫీలింగ్ కలుగుతుంది.