బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ హీరోగా, సంజయ్ దత్ ప్రధాన విలన్ పాత్రలో నటించిన షంషేరా సినిమా ఈ రోజు థియేటర్లలో రిలీజ్ అయింది. నిజానికి ఈ సినిమా వచ్చే ఏడాదిలో విడుదలవుతుందని అందరూ భావించారు. అయితే సడెన్ గా గత నెలలో ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించిందీ చిత్ర యూనిట్. ట్రైలర్ మరియు రణ్ బీర్ లుక్ ఆకట్టుకోవడంతో సినిమా పట్ల ప్రేక్షకులు అసక్తి కనబరిచారు.
కరణ్ మల్హోత్రా ఈ చిత్రానికి దర్శత్వం వహించగా మిథూన్ సంగీతాన్ని సమకూర్చారు. యశ్‌రాజ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా దీనిని నిర్మించారు. 150 కోట్లతో బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య ఈరోజు విడుదల అయింది.
ఇక ఈరోజు విడుదలైన షంషేరా చిత్రం తొలి రోజే నెగటివ్ టాక్ ను తెచ్చుకుంది. రణ్ బీర్ అభిమానులు తమ హీరోను చాలా కాలం తరువాత ధియేటర్ లో చూసి ఆనందించారు. ఇక ఆయన నటనను కూడా పొగడ్తలతో ముంచెత్తారు. అయితే బాలీవుడ్ రివ్యూయర్లు మరియు ఇతర సాధారణ ప్రేక్షక వర్గం మాత్రం షంషేరాను చీల్చి చెండాడు తున్నారు.
ట్విట్టర్ మరియు సోషల్ మీడియాలో తీవ్రంగా ఈ చిత్రాన్ని విమర్శిస్తున్నారు. 1800వ శతాబ్దం నేపథ్యంలో కథ నడిచే ఈ సినిమా కథ మరియు కథనం కాస్త కేజీఫ్ ను గుర్తుకు తెస్తుంది అని కొందరు అనగా.. కేవలం పోలికలే అని, కేజీఫ్ లో ఉన్న అద్భుతమైన ఫైట్ లు మరియు మాస్ అంశాలు ఇందులో సరిగా లేవని ప్రేక్షకులు అభిప్రాయపడ్డారు.
ఓ గిరిజన జాతికి ప్రతినిధిగా రణ్ బీర్ నటించగా, భారతీయుడు అయినా బ్రిటిష్ ప్రభుత్వం తరపున పని చేస్ పోలీస్ అధికారిగా సంజయ్ దత్ కనిపించారు. హీరో షంషేరా పాత్రలో రణ్ బీర్.. విలన్ శుద్ధ్ సింగ్ గా సంజయ్ దత్ ఇద్దరూ అదరగొట్టినా మిగతా సినిమా చాలా బోరింగ్ గా ఉన్నట్టు టాక్ వచ్చింది.
కరోనా వేవ్ ల వల్ల స్టార్ హీరోల సినిమాలు సరిగా విడుదల కాకుండా బాలీవుడ్ ఇబ్బందులు ఎదురుకుంటుంది. సరైన బ్లాక్ బస్టర్ లేక అక్కడి ప్రేక్షకులు కూడా దక్షిణ భారతీయ సినిమాల వైపు దృష్టి సారించారు. గడిచిన రెండేళ్లలో కేవలం రెండే భారీ హిట్ లు ఇచ్చింది బాలీవుడ్.
ఇక షంషేరా సినిమాతో అయినా బాలీవుడ్ విజయాల బాట పడుతుంది అని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి కానీ ఈ చిత్రానికి వచ్చిన మిశ్రమ స్పందనతో పాటు ఊహించని విధంగా చాలా తక్కువ స్థాయిలో ఓపెనింగ్స్ ను తెచ్చుకోవడంతో అందరూ నిరాశ చెందారు. రేపటి నుంచి కలెక్షన్లు పెరిగితే పరవాలేదు కానీ ఒకవేళ అలా జరగక పోతే బాలీవుడ్ మరో డిజాస్టర్ ను జమ చేసుకున్నట్లే.