రామ్ పోతినేని, కృతి శెట్టి హీరో, హీరోయిన్లుగా.. ఆది పినిశెట్టి విలన్‌గా నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘ది వారియర్’. తెలుగు, తమిళ భాషల్లో బై లింగ్వల్‌గా తెరకెక్కించిన ఈ సినిమాకి లింగుస్వామి దర్శకత్వం వహించారు. టీజర్స్, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. కాగా భారీ అంచనాల నడుమ ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలయింది. ఈ సినిమా ఒకేసారి అమెరికా, ఇండియాలో విడుదల అవటం విశేషం.
ఇక ఈరోజు విడుదలైన ఈ చిత్రానికి రివ్యూలు, టాక్ ఎలా ఉన్నాయి అంటే.. ట్రైలర్ చూస్తేనే ఇదొక పక్కా రొటీన్ యాక్షన్ ఎంటర్టైనర్ అని అర్థం అవుతుంది. కాబట్టి కొత్తదనం వంటివి ఆశిస్తే నిరాశ తప్పదు అంటున్నారు విశ్లేషకులు.
డాక్టర్ కం పోలీస్ గా హీరో రామ్ అదరగొట్టారు అని సమాచారం. అలాగే విలన్ పాత్రలో ఆది కూడా ఒదిగిపోయారు అని రివ్యూలలో ఆయన నటనకు మంచి స్పందన వచ్చింది. ఇక లేటెస్ట్ సెన్సెషన్ కృతి శెట్టి పాత్రకు అంతగా ప్రాధాన్యత లేకున్నా, తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్ , డాన్స్ తో ఆకట్టుకుంటుంది అంటున్నారు.
ఇక బాక్స్ ఆఫీస్ విషయానికి వస్తే.. రామ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బిజినెస్ జరుపుకుంది ఈ చిత్రం. రిలీజ్ కూడా అత్యధిక థియేటర్లలో చేశారు. అయితే సరిగ్గా సినిమా విడుదల సమయానికి రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవడం ఒక దెబ్బగా చెప్పుకోవచ్చు. అందుకు తగ్గట్టు గానే ఓపెనింగ్స్ చాలా సాధారణ స్థాయిలో వచ్చాయి.
ది వారియర్ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ అవ్వాలి అంటే 44 కోట్ల షేర్ కలెక్షన్లు వసూలు చేయాలి. మరి వారాంతానికి వసూళ్లు పెరగపోతే సినిమా హిట్ స్టేటస్ ను అందుకోవడం కష్టం. భారీగా బిజినెస్ జరిగిన కారణంగా ఈ సినిమా కలెక్షన్లు పెరగాలి అని కోరుకుందాం. ది వారియర్ సినిమా తరువాత హీరో రామ్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేయనున్నారు. మరి ఈ సినిమా ఫలితం ఆ సినిమా బడ్జెట్, బిజినెస్ మీద ప్రభావం చూపుతుంది అనడంలో సందేహం లేదు. మరి ది వారియర్ సినిమా చివరికి ఏ ఫలితం చూస్తుంది అనేది చూడాలి.