Homeసినిమా వార్తలుదిల్ రాజుకు అచ్చిరాని బాలీవుడ్

దిల్ రాజుకు అచ్చిరాని బాలీవుడ్

- Advertisement -

ప్రమఖ నిర్మాత దిల్ రాజు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్వశక్తితో, ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఆయన ఒక డిస్ట్రిబ్యుటర్ నుంచి అగ్ర నిర్మాతగా ఆయన ఎదిగిన వైనం ఎందరికో ఆదర్శంగా నిలిచింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మొదట్లో చిన్న సినిమాలతో ప్రయాణం మొదలుపెట్టిన దిల్ రాజు ఆ తరువాత పెద్ద హీరోలతోనూ సినిమాలు తీశారు.

ఈ నగరానికి ఏమైంది, ఫలక్ నుమా దాస్ వంటి సినిమాలతో.. నటుడుగా తనకంటూ ఓ ప్రత్యేక గర్తింపు తెచ్చుకున్న యువ హీరో విశ్వక్ సేన్. ఆయన కొత్త డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో చేసిన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ “హిట్”. హీరో నాని నిర్మించిన ఈ చిత్రం చక్కని ప్రశంసలతో పాటు బాక్స్ ఆఫీస్ వద్ద కూడా విజయం సాధించింది. విమర్శకుల ప్రశంసల్నీ దక్కించుకుంది. 2020లో కరోనా మొదట వేవ్ కి నెల రోజుల ముందు విడుదలైంది “హిట్” సినిమా.

ఆ చిత్రాన్ని హిందీలో యువనటుడు రాజ్ కుమార్ రావు హీరోగా, సానా మల్హోత్రా హీరోయిన్ గా.. తెలుగు వెర్షన్ ను తెరకెక్కించిన దర్శకుడు శైలేష్ కొలను ఏ ఈ రీమేక్ వెర్షన్ కూడా భాధ్యత వహించారు. దీనికి అగ్ర నిర్మాత దిల్ రాజు నిర్మాత. టీ సీరీస్ సంస్థ కూడా సహా నిర్మాతలుగా వ్యవహరించిన ఈ సినిమా ఈ శుక్రవారం విడుదల అయింది.అయితే రివ్యూల పరంగా ఈ చిత్రం బాగానే మార్కులు వేయించుకున్నా, బాక్స్ ఆఫీసు వద్ద మాత్రం వసూళ్లు మాత్రం మరీ తీసికట్టుగా ఉన్నాయి.

READ  రాకీీ భాయ్ తో అపరిచితుడు

దిల్ రాజు “హిట్” సినిమా కాకుండా మరో హిందీ సినిమాకు కూడా నిర్మాతగా వ్యవహరించారు. తెలుగులో హీరో నాని – గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్లో వచ్చిన “జెర్సీ” చిత్రాన్ని హిందీలో షాహిద్ కపూర్ తో నిర్మించారు. అయితే ఆ చిత్రం కూడా కేవలం రివ్యూల వరకే మంచి స్పందన రాగా.. బాక్స్ ఆఫీస్ వద్ద ఘోర పరాజయం పొందింది. తొలి మూడు రోజుల వరకూ నామ మాత్రపు కలెక్షన్లు వచ్చినా ఆ తరువాత ఒక్కసారిగా ఆ చిత్రం చతికిల బడింది. సుమారుగా 25 కోట్ల గ్రాస్ మాత్రమే వసూలు చేయగలిగింది.

దిల్ రాజు హిందీలో తీసిన రెండు చిత్రాలు కూడా ఇలా ఫ్లాప్ అవడంతో.. ఆయనకు హిందీ పరిశ్రమ అంతగా అచ్చి రాలేదు అనే మాటలు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. తెలుగులో పని చేసే విధానానికి, హిందీలో పని చేసే విధానానికి చాలా తేడా ఉంది. అలాగే ప్రచార కార్యక్రమాల కూడా పద్ధతి కూడా వేరేలా ఉంటుంది. మరి రెండు పరాజయాల తరువాత దిల్ రాజు హిందీ సినిమా వైపు వెళ్లకుండా ఉంటారా లేక మరోసారి ప్రయత్నించి విజయం సాధిస్తారా అనేది చూడాలి.

READ  సౌత్ ఇండియన్ సినిమాకి ఐకాన్ గా నిలిచిన అల్లు అర్జున్

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories