Homeసినిమా వార్తలుThank you movie: థాంక్యూ సినిమా సెన్సార్ మరియు ప్రీమియర్ షో డిటైల్స్

Thank you movie: థాంక్యూ సినిమా సెన్సార్ మరియు ప్రీమియర్ షో డిటైల్స్

- Advertisement -

అక్కినేని నాగ చైతన్య హీరోగా నటిస్తున్న తాజా చిత్రం “థాంక్యూ”. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్‌కు సిద్ధమైంది. సెన్సార్ బోర్డు నుంచి కూడా ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. ఈ సినిమా యూ/ఎ సర్టిఫికెట్‌ పొందింది. సినిమా నిడివి కూడా ఖరారు అయింది. సినిమా నిడివి 2 గంట‌ల 9 నిమిషాలకు రంగరించారు. పక్కా ఫీల్ గుడ్ సినిమాగా వస్తున్న ఈ చిత్రం ఈ శుక్రవారం అంటే జులై 22న థియేటర్లలో విడుదల కానుంది.


ఈ చిత్రంలో అక్కినేని నాగ చైతన్య,  సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానిగా కనిపించనున్నారు. అదీ కాకా ఈ చిత్రంలో హీరో పాత్ర మూడు కోణాల్లో సాగుతుందని, ఆ పాత్రలో నాగ చైతన్య అద్భుతంగా నటించినట్లు తెలుస్తోంది. రాశీ ఖన్నా, అవికా గోర్‌, మాళవిక నాయర్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. స్వతహాగా తన సినిమాల్లో  స్క్రిప్ట్ విషయంలో ఆయన పాలు పంచుకుని తనదైన ఐడియాలతో సినిమాని విజయవంతం చేయడంలో తన వంతు కృషి చేస్తూ ఉంటారు. థాంక్యూ సినిమాకి కూడా అదే విధంగా ఆయన చేసినట్లు తెలుస్తోంది. అందుకే మొదట్లో ఈ చిత్రానికి దాదాపు మూడు గంటలు ఉన్న నిడివిని ఒక 40 నిమిషాల వరకూ కుదించారని సమాచారం.

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లవ్ స్టోరీ చిత్రంలో తన నటనకు అత్యుత్తమ ప్రశంసలు అందుకున్నారు నాగ చైతన్య. సాయి పల్లవి లాంటి అద్భుతమైన ప్రతిభ గల నటితో పోటీ మెప్పించడం సామాన్యమైన విషయం కాదు. ఇక ఆ తరువాత ఈ ఏడాది సంక్రాంతికి తన తండ్రి కింగ్ నాగార్జునతో కలిసి బంగార్రాజు వంటి  సూపర్ హిట్ సినిమాను అందించారు నాగ చైతన్య. ఆ సినిమాతో పండగ పూట పసందైన పల్లెటూరు వినోదాన్ని అందించి ప్రేక్షకులను అలరించారు.

READ  రామ్ చరణ్ - శంకర్ సినిమా రిలీజ్ ఎప్పుడంటే?


అయితే చిత్రం విడుదల తేదీ దగ్గరకి వస్తున్నా, థాంక్యూ సినిమాకి అనుకున్నంత స్థాయిలో ఆన్లైన్ బుకింగ్ జరగట్లేదు. దీనికి కారణం చాలా ఆలస్యంగా బుకింగ్స్ ఓపెన్ అవడం కూడా అనచ్చు. ఇక ఈ కారణం చేత చిత్రానికి మరింత హైప్ తెప్పించడానికి గురువారం అంటే జూలై 21 రాత్రి తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోలు వేయనున్నారని సమాచారం.


ఇక జూలై 22న థాంక్యూ విడుదల తర్వాత బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ హీరోగా తెరకెక్కిన లాల్ సింగ్ చడ్డా మూవీలో కూడా కీలక పాత్రలో నటించారు నాగ చైతన్య. ఆ సినిమా ఆగస్టు 11న థియేటర్స్‌లోకి రానుంది. ఈ రెండు సినిమాలు విడుదలయ్యాక.. తమిళ డైరెక్టర్ వెంకట్ ప్రభు సినిమాను ఒకే చేశారు. ఈ సినిమాలో చైతన్య పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తారని టాక్. ఇవే కాక అటు పైన  పరశురామ్‌, తరుణ్‌ భాస్కర్‌ వంటి దర్శకులతో కూడా నాగ చైతన్య సినిమా చేయనున్నారని తెలుస్తోంది.

READ  ప్రేక్షకులదే తప్పు అంటున్న నాని

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories