Homeసినిమా వార్తలుProducers Guild: తెలుగు సినిమా నిర్మాతల సంచలన నిర్ణయం?

Producers Guild: తెలుగు సినిమా నిర్మాతల సంచలన నిర్ణయం?

- Advertisement -

కరోనా పాన్డేమిక్ తరువాత సినిమాల బడ్జెట్ భారీగా పెరిగిపోయింది. దానిక తగ్గట్టే నటీనటుల పారితోషికాలు కూడా పెంచేశారు. ఇటు పక్కా క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు కూడా భారీగా రెమ్యునరేషన్ లని పెంచేశారని సమాచారం . అలాగే ఇటీవల 24 క్రాప్ట్స్ కి చెందిన టెక్నిషయన్స్, జూనియర్ ఆర్టిస్ట్ లు కూడా తమ కనీస వేతనాలు పెంచాల్సిందే అంటూ మెరుపు సమ్మెకు దిగిన విషయం తెలిసిందే.

ఇలా ప్రతీ విషయంలోనూ సినిమాల నిర్మాణం ఇబ్బందికరంగా మారిన నేపథ్యంలో తెలుగు సినిమా నిర్మాతల మండలి (Producers guild) ఒక నిర్ణయం తీసుకోబోతున్నారని తెలిసింది.

ఈ మేరకు గిల్డ్ సభ్యులైన నిర్మాతలు శనివారం ప్రత్యేకంగా సమావేశం అయ్యారట. ఆ సమావేశంలోనే సంచలన నిర్ణయానికి సిద్ధం అయినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.ఓ పక్క స్టార్ హీరోల నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ ల వరకు..మరియు రోజు కూలీలతో పాటు 24 క్రాఫ్ట్ లకు చెందిన వారంతా ఒకేసారి పారితోషికాలు పెంచేయడంతో సినిమాలు నిర్మించలేని స్థితిలో వున్నామని సమావేశంలో నిర్మాతలు వాపోతున్నారని తెలిసింది.

READ  ఓటీటీ లో జయమ్మ పంచాయితీ

ఈ సమావేశంలో పారితోషికాల విషయంలో సమ్మెకు దిగుతూ కొంత మంది సినిమాల షూటింగ్ లని ఆపడానికి ప్రయత్నించిన విషయం..మరో పక్క క్యారెక్టర్ ఆర్టిస్టుల ఫైవ్ స్టార్ భోజన ఖర్చులతో పాటు కొంత మంది రోజుల వారిగా.. గంటల వారిగా రెమ్యునరేషన్ లని డిమాండ్ చేస్తున్న విషయం కూడా చర్చకు వచ్చినట్టుగా చెబుతున్నారు.

ఇలాగే వుంటే పరిస్థితి తమ చేయిదాటి పోతుందని..ఏదైనా కఠిన నిర్ణయం తీసుకుని దాన్ని అమలు చేయాలని ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఒక అభిప్రాయానికి వచ్చినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఒక వైపు పెరిగిన నిర్మాణ వ్యయాన్ని అదుపు చేయలేక, మరోవైపు థియేటర్లకు ప్రేక్షకులు రాక.. ఇలా నానా కష్టాలు పడే కంటే ఈ సమస్యలన్నీ ఓ కొలిక్కి వచ్చాకే సినిమాల షూటింగ్ లని తిరిగి ప్రారంభిస్తే మంచిదనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. అంత వరకూ కొత్తగా ప్రారంభమయ్యే సినిమాల షూటింగ్ లని నిరవధికంగా వాయిదా వేయాలని నిర్ణయించుకున్నారట.

మరి ఈ నిర్ణయం నిజంగా అమలు జరుగుతుందా, లేక ఇలా పుకార్ల వరకే పరిమితం అవుతుందా అనేది తెలియాలి అంటే కొద్ది రోజులు ఆగక తప్పదు. ఎందుకంటే మరో రెండు మూడు రోజుల్లో షూటింగ్ల నిలుపుదలపై ప్రొడ్యూసర్స్ గిల్డ్ అధికారిక ప్రకటన చేయనుందని తెలిసింది. మరి ఈ వార్తల్లో ఎంత వరకూ నిజం ఉందో చూద్దాం.

Follow on Google News Follow on Whatsapp

READ  నాగార్జున టైటిల్ తో వస్తున్న రజినీకాంత్


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories