Homeసినిమా వార్తలుతెలుగు ఫిల్మ్ ఛాంబర్ కామర్స్ కీలక సమావేశం

తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కామర్స్ కీలక సమావేశం

- Advertisement -

థియేటర్లలో విడుదలయ్యే తెలుగు సినిమాలను ఓటీటీలో ఎన్ని వారాల తర్వాత స్ట్రీమింగ్ చేయాలనే విషయంలో గత కొంతకాలంగా చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల జరిగిన సమావేశంలో తెలుగు సినీ నిర్మాతలు కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకున్నారు. చిన్న సినిమాలైతే థియేట్రికల్ రిలీజ్ తరువాత ఆరు వారాల గ్యాప్ తో ఓటిటి రిలీజ్ చేయాలని,అదే పెద్ద సినిమాలైతే కనీసం ఎనిమిది వారాలు ఆగాలని నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి.

ప్రస్తుతం సినిమా విడుదలైన తర్వాత నాలుగో వారంలోగా ఓటీటీలో సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. కొన్ని సినిమాలైతే నెల రోజుల తర్వాత స్ట్రీమింగ్ అవుతుంటే బాక్సాఫీస్ దగ్గర పరాజయం పాలైన సినిమాలు కొన్ని నాలుగు వారాల కంటే ముందే ఓటీటీలో వచ్చిన సందర్భాలూ ఉన్నాయి. అయితే ఇటీవల కొందరు నిర్మాతలు సినిమాలు థియేటర్లలో విడుదలైన యాభై రోజుల తర్వాత ఎనిమిది వారాల తర్వాత మాత్రమే ఓటీటీలో స్ట్రీమింగ్ చేయాలనే నిబంధన పెట్టుకున్నట్టు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఈ సమస్యకు ఒక పరిష్కారం తీసుకు రాబోతోందట.

ఇక ఈ విషయంతో పాటు తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రస్తుతం సినిమా టిక్కెట్ రేట్ల విషయంలో ఉన్న గందరగోళాన్ని కూడా పొగొట్టే ప్రయత్నం చేస్తుందని సమాచారం. ఇటీవలి కాలంలో తెలుగు సినిమా టికెట్ రేట్లు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. ఒక్కో సినిమాకి పెంచుతూ తగ్గుతూ ఏదో చిన్న పిల్లల ఆటలా తయారయింది మొత్తం వ్యవహారం.

READ  NKR-19: కళ్యాణ్ రామ్ కొత్త సినిమాకు క్రేజీ ఆఫర్

అందుకే ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కొన్ని సవరణలు చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో .. చిన్న సినిమాలను ఎ, బి సెంటర్స్ లో రూ. 100, 125 రూపాయలకు, సి సెంటర్స్ లో రూ. 70, 125 రూపాయలకు ప్రదర్శించాలని పేర్కొందిట. అలానే మీడియా బడ్జెట్ మూవీస్ ను ఎ, బి సెంటర్స్ లో రూ. 112, 177కు, సి సెంటర్స్ లో రూ. 100, 177కు ప్రదర్శించాలని తేల్చిందని సమాచారం. ఇక బిగ్ బడ్జెట్ మూవీస్ ను అయితే ఎ, బి సెంటర్స్ లో రూ. 177, 295, సి సెంటర్స్ లో రూ. 150, 295కు ప్రదర్శించాల్సి ఉంటుందని తెలిపినట్లు చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ సినిమాలు తప్ప మిగతా సినిమాల టికెట్ రేట్లు ప్రేక్షకుల అందుబాటులోకి వస్తాయి అన్నమాట.

అయితే టికెట్ రేట్ల తగ్గింపుపై కుదిరిన ఏకాభిప్రాయం షూటింగ్ లను ఆపేసే విషయంలో మాత్రం కుదరలేదని పలువురు నిర్మాతలు ఈ విషయం పై విభేదించారని తెలిసింది. భేటీ అనంతరం ఒక ప్రముఖ నిర్మాత మాట్లాడుతూ.. సినిమా షూటింగ్ ల నిలుపుదల పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు.అంతే కాకుండా సినిమా రంగ సమస్యలపై ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశామని, ఆ కమిటీ ఈ నెల 27న ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడి ఆధ్వర్యంలో కమిటీ భేటీ అవుతుందని ఆయన తెలిపారు. అయితే తుది నిర్ణయం మాత్రం కమిటీ తీర్మానించినదే ఉంటుందని అంటున్నారు.

READ  ఇస్మార్ట్ శంకర్ తో హరీష్ శంకర్

అలాగే ఈ సమావేశంలో ఓటిటి విడుదలకు ఇవ్వాల్సిన సమయం గురించి ఎవరి అభిప్రాయాల్ని వారు వెల్లడించారే కానీ ఈ సమస్యపై నిర్మాతలు ఏకాభిప్రాయానికి రాలేదని తెలుస్తోంది. దీనిపై మరోసారి చర్చించనున్నారట.

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories