హీరోయిన్ సమంత ప్రస్తుతం తన వ్యక్తిగత జీవితంలోని విషయాలను పక్కన పెట్టి కెరీర్ ను చక్కబెట్టే పనిలో ఉన్నారు. వరుస సినిమాలతో బిజీగా ఉంటూ తన ఇమేజ్ ను స్టార్ డం ను పెంచుకుంటూ పోతున్నారు. అంతే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో బిజీ అయ్యేందుకు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆమె మొన్నటి వరకు తెలుగులో చాలా బిజీగా కనిపించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు తన దృష్టిని అంతా బాలీవుడ్ ఇండస్ట్రీ పైన పెట్టినట్లుగా తెలుస్తోంది. ఇక రాబోయే రోజుల్లో సమంత నుంచి చాలా పెద్ద సినిమాలే రాబోతున్నాయట.
ఇదివరకే బాలీవుడ్ యువ హీరో ఆయుష్మాన్ ఖురానా తో ఒక సినిమా చేసే అవకాశం దక్కించుకున్నారు సమంత. అలాగే ప్రస్తుతం మరికొన్ని ప్రాజెక్టులలో కూడా నటించేందుకు చర్చలు జరుపుతున్నారట. అలాగే బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ తో ఒక పెద్ద సినిమాలో కూడా నటించే అవకాశాలు ఉన్నాయి. ఇక వీటితో పాటు తాజాగా స్టార్ హీరో అక్షయ్ కుమార్ తో కూడా ఒక సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల కరణ్ జోహార్ కాఫీ విత్ కరణ్ షోలో సమంత పాల్గొన్న విషయం తెలిసిందే.
ఆ షోలో ఆమెతో పాటు బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కూడా అతిధిగా విచ్చేశారు. ఈ షోలో సమంత తన వ్యక్తిగత జీవితం గూర్చీ, అలాగే హీరోయిన్ గా తనని తాను వృద్ధిలో ఉంచేందుకు ఎలా కృషి చేస్తున్నారో తెలిపారు.
ఈ రోజుల్లో ఇండస్ట్రీలో పేరు సంపాదించుకోవాలి అంటే కేవలం ప్రతిభ ఉంటే సరిపోదు. మనల్ని మనం మార్కెట్ కూడా చేసుకోవాలి. అది సినిమా ఇండస్ట్రీలో సర్వ సాధారణం. హీరోలు హీరోయిన్లు పబ్లిసిటీ నిమిత్తం ఒక మనిషి లేదా టీమ్ ను పెట్టుకుని వారి వారి సినిమాల గురించి మరియు వాళ్ల పనితనం గురించి సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యేలా చేయడం ఒక ఫార్ములాగా దాదాపు అందరూ పాటిస్తున్నారు.
ఇదే విషయం పై సమంత కూడా నోరు విప్పారు. ఫలానా సర్వేలో ఎక్కువ పాపులర్ హీరోయిన్ గా తన పేరు వచ్చేలా చేసేందుకు గానూ తన పీఆర్ (PR) టీమ్ కు డబ్బులు ఇచ్చి పని చేయించినట్లుగా తెలిపారు. సమంత ఇలా డబ్బులు ఖర్చుపెట్టి తనని తాను మార్కెటింగ్ చేసుకుంటున్నారు అని ఇదివరకే కొన్ని పుకార్లు వచ్చాయి. ఇప్పుడు సమంత స్వయంగా ఆ మాట చెప్పడంతో ఈ వ్యవహారం మీద కొంత మంది పాజిటివ్ గా రియాక్ట్ అయితే మరికొందరు విమర్శలు చేస్తున్నారు.