Homeసినిమా వార్తలుతగ్గేదెలే అంటున్న రష్మిక మందన్న

తగ్గేదెలే అంటున్న రష్మిక మందన్న

- Advertisement -

ఛలో సినిమాతో అందరినీ తన దృష్టికి తిప్పుకున్న హీరోయిన్ రష్మిక మందన్న. అంతకు ముందే కన్నడ చిత్రం కిరిక్ పార్టీ తోనే ఆమెకు మంచి క్రేజ్ వచ్చింది. ఇక తెలుగులో తొలి సినిమా విజయం సాధించిన తరువాత వెనక్కి తిరిగి చూసుకునే అవసరం లేకుండా పోయింది. గీత గోవిందం, సరిలేరు నీకెవ్వరు, భీష్మ ఇలా వరుస విజయాలతో దూసుకుపోయారు. మధ్యలో డియర్ కామ్రేడ్ ఆశించినంత విజయం సాధించక పోయినా, ఆమె నటనకు చక్కని ప్రశంసలు అందుకున్నారు.

ఇక గతేడాది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో చేసిన పుష్ప తరువాత ఈ నేషనల్ క్రష్ జోరుకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. ఆ క్రేజ్ తో బాలీవుడ్ లో వరుసగా ఆఫర్లని సొంతం చేసుకోవడం మొదలు పెట్టారు. ఇప్పటికే మూడు భారీ ప్రాజెక్ట్ లలో నటిస్తున్న రష్మిక మందన్న తాజాగా మరో ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది.

రష్మిక నటిస్తున్న తొలి బాలీవుడ్ సినిమా `మిషన్ మజ్ను`. ఈ సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. సిద్ధార్ధ్ మల్హొత్రా హీరోగా నటిస్తున్న ఈ సినిమాని శంతను బగ్చి రూపొందిస్తున్నారు.పాకిస్థాన్ నేపథ్యంలో సాగే సీక్రెట్ ఆపరేషన్ కథతో ఈ మూవీని తెరకెక్కించారని సమాచారం. భారీ స్థాయిలో రూపొందిన ఈ సినిమా, కరోనా కారణంగా రిలీజ్ లేట్ అవుతూ వస్తుందట.

READ  మరింత ఆలస్యంగా రానున్న మహేష్ - త్రివిక్రమ్ సినిమా

ఇక అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్న `గుడ్ బై`లో నటించే అవకాశం కూడా రష్మిక ను వరించింది. ఇటీవలే ఈ సినిమాలో తన పాత్రకు సంభందించిన షూటింగ్ కూడా పూర్తి చేసేసినట్టు తెలుస్తుంది. దీని తరువాత రణ్ బీర్ కపూర్ – సందీప్ రెడ్డి వంగా కలయికలో రాబోతున్న ‘యానిమల్`లో నటించే అవకాశాన్ని కూడా రష్మిక దక్కించుకున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో వుండగానే రష్మిక మరో బాలీవుడ్ ప్రాజెక్ట్ ని సొంతం చేసుకోవడం విశేషం. టైగర్ ష్రాఫ్ హీరోగా శశాంక్ ఖేతాన్ ఈ సినిమాని తెరకెక్కించబోతున్నారు. సెప్టెంబర్ నుంచి ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ సెట్స్ పైకి వెళ్లబోతోంది. ఇక వచ్చే ఏడాది పుష్ప 2 రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే, ఆ సినిమా రిలీజ్ తరువాత మన నేషనల్ క్రష్ కి ఇంకెన్ని అవకాశాలు వస్తాయో.. ఇంకెంత క్రేజ్ ను పెంచుకుంటుందో చూడాలి.

Follow on Google News Follow on Whatsapp

READ  దీపికా పదుకునే ఆరోగ్యం బాగానే ఉందంటున్న నిర్మాతలు


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories