Homeసినిమా వార్తలుడిజాస్టర్ దిశగా ది వారియర్ అడుగులు

డిజాస్టర్ దిశగా ది వారియర్ అడుగులు

- Advertisement -

ఉస్తాద్ రామ్ పోతినేని, లేటెస్ట్ సెన్సెషన్ కృతి శెట్టి జంటగా నటించిన చిత్రం ‘ది వారియర్’. ‘ఇస్మార్ట్ శంకర్’తర్వాత రామ్ మరోసారి మాస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తమిళ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా రామ్ పోతినేని ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో నటించారు. భారీ అంచనాల నడుమ ఈ చిత్రం నిన్న ప్రపంచ వ్యాప్తంగా 1200కు పైగా థియేటర్లలో పెద్ద ఎత్తున విడుదల అయింది.

అయితే తొలి రోజు ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి టాక్, విమర్శకుల దగ్గర నుంచి రివ్యూలు మోస్తరుగా వచ్చాయి. డాక్టర్ నుంచి పోలీస్ గా మారే హీరో కథ ఆసక్తికరంగా ఉన్నా, తీసిన విధానంలో చాలా వరకు మూస ఫార్ములా తరహా ఛాయలు ఉండటం సినిమాకు మైనస్ గా మారిందని సమాచారం. ఇక దేవిశ్రీప్రసాద్ నేపథ్య సంగీతానికి కూడా ప్రేక్షకులు మైనస్ మార్కులు వేశారు.

ఇక బాక్స్ ఆఫీస్ వద్ద “ది వారియర్’ సినిమా వసూళ్ల పరిస్థితి తొలి రోజు వరకు పరవాలేదు అనే స్ధాయిలో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా తొలిరోజున ఈ చిత్రం దాదాపు 8 కోట్ల వరకు చేసింది. అయితే ఈ చిత్ర ప్రి రిలీజ్ బిజినెస్ దాదాపు 44 కోట్లకు చేసినందు వల్ల ఈ కలెక్షన్లు సరిపోవని.. వారాంతాల్లో కలెక్షన్లు పెరగకపోతే సినిమా పరాజయం పాలవడం ఖాయం అని ట్రేడ్ వర్గాలు అన్నాయి.

READ  తొమ్మిదేళ్ళ తరువాత సినిమాల్లోకి వస్తున్న వేణు

ఇదిలా ఉండగా మొదటి రోజున పరవాలేదు అనిపించిన ఈ సినిమా కలెక్షన్లు.. రెండవ రోజు మరింత తగ్గుతూ వచ్చాయి. ట్రెండ్ చూస్తుంటే మళ్ళీ పైకి లేచెలా కనిపించటం లేదు. ఇలానే కొనసాగితే జరిగిన బిజినెస్ లో యాభై శాతం కూడా రాబట్టలేని పరిస్థితి ఏర్పడే ప్రమాదం ఉంది.అదే గనక నిజం అయితే ది వారియర్ చిత్రం భారీ డిజాస్టర్ లలో ఒకటిగా నిలుస్తుంది.

ప్రస్తుతం పరిశ్రమ గడ్డు కాలంలో నడుస్తున్న దశలో. మరో సినిమా లాస్ ల చిట్టా తెరిస్తే అది చాలా బాధాకరమైన విషయం అనే చెప్పాలి.

Follow on Google News Follow on Whatsapp

READ  బండ్ల గణేష్ వ్యాఖ్యలకు ఘాటుగా స్పందించిన పూరి


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories