నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న తాజా చిత్రం ‘బింబిసారా’. ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉండేలా చేయడంలో చిత్ర బృందం సఫలం అయ్యారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్రం తాలూకు టీజర్ మరియు ట్రైలర్లు ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి అని చెప్పవచ్చు. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో దర్శకుడు వశిష్ట్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది.
ఇక కళ్యాణ్ రామ్ బింబిసారుడి గెటప్ లో అద్భుతంగా సరిపోయాడు. అంతే కాకుండా ఈ సినిమాలో తన కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా టీజర్స్ చూస్తేనే పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్ ఇవ్వనున్నారని అర్థమవుతోంది.
కాగా ఇప్పటికే ఈ చిత్రం నుంచి పాటను రిలీజ్ చేసిన చిత్ర యూనిట్, ఇటీవలే రెండో సింగిల్ సాంగ్‌ను కూడా రిలీజ్ చేసింది. ‘ఓ తేనె పలుకుల’ అంటూ సాగే ఆ పాట ప్రేక్షకులని ఆకట్టుకుంది. ఇక ఈ పాటకి సంభందించిన వీడియో ప్రోమోను జూలై 23న విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.
ఇదిలా ఉండగా ఈ చిత్ర నుంచి మరో ఆసక్తికరమైన అప్డేట్ వచ్చింది. అదేంటంటే హీరోయిన్ కేథరిన్ థెరీసా పాత్రను పరిచయం చేస్తూ ఒక వీడియో విడుదల చేశారు బింబిసార చిత్ర యూనిట్. కేథరిన్ ను “ఇరా” గా పరిచయం చేసిన ఈ ప్రోమో చూస్తుంటే చిత్రంలో ఆమె ఒక యువరాణి పాత్రలో కనిపించబోతున్నట్లుగా అనిపిస్తుంది.
ఈ సినిమాలో కేతరిన్ థెరీసాతో పాటు మరో హీరోయిన్ సంయుక్తా మీనన్ కూడా నటిస్తున్నారు. అటు ఫాంటసీ ఎలిమెంట్స్ తో పాటు గ్లామర్ కూడా సినిమాలో ఉంటుందని ఈ విధంగా స్పష్టం అయినట్లే. ఇలా ప్రేక్షకులని అలరించే అన్ని అంశాలు ఉన్నందున ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ అసక్తి నెలకొంది.
ఈ సినిమాను కళ్యాణ్ రామ్ తన సొంత బ్యానర్ ఎన్టీఆర్ ఆర్ట్స్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుండగా, ఎంఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాను ఆగస్టు 5న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు కళ్యాణ్ రామ్ మరియు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు.