ప్రస్తుతం దేశవ్యాప్తంగా సినిమా లవర్స్ లో కూలీ, వార్ 2 మ్యానియా విపరీతంగా కొనసాగుతోంది. ముఖ్యంగా ఈ రెండు సినిమాలు పలువురు టాప్ స్టార్స్ తో పాటు పలు క్రేజ్ కాంబినేషన్స్ లో రూపొందడమే ఇందుకు కారణం. రేపు ఉదయం ఆట నుండి ఈ రెండు మూవీస్ కూడా గ్రాండ్ గా పలు థియేటర్స్ లో ఆడియన్స్ ముందుకి రానున్నాయి.
రజినీకాంత్ హీరోగా నాగార్జున విలన్ గా రూపొందిన కూలీని లోకేష్ కనకరాజ్ తెరకెక్కించగా సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించింది. ఇక ఎన్టీఆర్, హృతిక్ రోషన్ హీరోలుగా రూపొందిన వార్ 2 మూవీని అయాన్ ముఖర్జీ తెరకెక్కించగా యష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ గ్రాండ్ గా నిర్మించింది. ఈ రెండు సినిమాలపై ఆయా హీరోల ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలు ఉన్నాయి.
విషయం ఏమిటంటే, ముఖ్యంగా ప్రస్తుతం ఓపెనింగ్స్ పరంగా కూలీ మూవీ ప్రీ బుకింగ్స్ లో బాగా దూసుకెళ్తుండగా వార్ 2 కొంత వెనుకపడింది. అయితే కంటెంట్ పరంగా ఏది బాగుంటే ప్రేక్షకులు దానికి ఓటేస్తారనేది తెలిసిందే. ఈ విషయమై దర్శకులు ఇద్దరికీ కూడా పెద్ద పరీక్షే అని చెప్పాలి .
ముఖ్యంగా అటు కూలీ, ఇటు వార్ 2 రెండు ట్రైలర్స్ అంచనాలు అందుకోలేదు, ముకేగమ సినిమాల యొక్క ప్రధాన అంశాలు, కథ అంతా కూడా థియేటర్స్ లో ఆకట్టుకుంటుందని, పలు కీలక అంశాలు దాచి ఉంచారని రెండు టీమ్స్ అంటున్నాయి. తొలిసారిగా తన అభిమాన కథానాయకుడితో లోకేష్ తీసిన కూలీ పెద్ద ఖాయం అని ఆ మూవీ టీమ్, అలానే ఎన్టీఆర్, హృతిక్ లతో ఎంతో గ్రాండ్ గా అయాన్ వార్ 2 తీసారని ఆ మూవీ టీమ్ సక్సెస్ పై నమ్మకముగా చెప్తున్నాయి.
అయితే ఈ ఇద్దరు దర్శకులు కంటెంట్ విషయమై ముఖ్యంగా ఫ్యాన్స్ తో పాటు సాధారణ ఆడియన్స్ ని ఎవరు మెప్పిస్తే వారిదే ఇకపై కలెక్షన్స్ పంట. మరి ఈ భీకర బాక్సాఫీస్ పోరులో ఏ మూవీ ఏ దర్శకుడు విజయం అందుకుంటారో తెలియాలి అంటే మరికొన్ని గంటలు ఆగాలి.