Homeసినిమా వార్తలుఏజెంట్ టీమ్ పెద్ద సాహసమే చేయనున్నారా?

ఏజెంట్ టీమ్ పెద్ద సాహసమే చేయనున్నారా?

- Advertisement -

హీరోగా వరుస పరాజయాల్లో ఉండి ఒక మంచి విజయం కోసం ఎదురు చూస్తున్న అక్కినేని వారసుడు అఖిల్ అక్కినేనికి ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాతో కథానాయకుడిగా తొలి విజయం దక్కింది. గత ఏడాది బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాలో కాస్త సాప్ట్ రోల్ లో కనిపించి మెప్పించిన అఖిల్.. ఇపుడు ఏజెంట్ సినిమా కోసం ఒక యాక్షన్ హీరోగా మారిపోయారు.

ఈ సినిమాకు వక్కంతం వంశీ కథను అందిస్తున్నారు. ఈ చిత్రాన్నిఏకే ఎంటర్టెన్మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర, సురెందర్2 సినిమా బ్యానర్ పై సురేందర్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ గాతెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో విడుదలకు అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. ఇక ఈ సినిమాలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి మరో ముఖ్య పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.

ఇటీవలే ‘ఏజెంట్’ సినిమా టీజర్‌ను వివిధ భాషల్లో ఏక కాలంలో విడుదల చేశారు. కాగా ఈ టీజర్ సాంకేతికంగా హాలీవుడ్ స్థాయిలో ఉందని చెప్పవచ్చు. డైరెక్టర్‌గా సురేందర్ రెడ్డి టేకింగ్ అద్భుతంగా ఉంది. అఖిల్ గెటప్ కూడా అదిరిపోయింది అని టీజర్ చూసిన ప్రేక్షకులు అంటున్నారు. ఈ సినిమా కోసం అఖిల్ ఎంతో కష్టపడి తన శరీరాకృతిని మార్చుకున్నారు.

READ  ది వారియర్ కి DSP BGM మైనస్ అంటున్న ప్రేక్షకులు

ఈ చిత్రాన్ని మొదట దసరాకు విడుదల చేయాలని భావించినా కోన్ని కారణాల వల్ల వాయిదా వేయాల్సి వచ్చింది. ఇక దీపావళికి విడుదల చేస్తారని కొన్ని పుకార్లు కూడా వచ్చాయి. అయితే తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం “ఏజెంట్” చిత్రాన్ని క్రిస్మస్ సందర్భంగా విడుదల చేస్తున్నారు అని తెలియవచ్చింది.

అయితే ఈ నిర్ణయం అంత మంచిది కాదని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ఎందుకంటే ప్రపంచ వ్యాప్తంగా అత్యున్నత స్థాయిలో తెరకెక్కి.. అద్భుతమైన సినిమాగా ఉండబోతోందనే భారీ అంచనాలు ఉన్న “అవతార్ -2” ఆ డేట్ కు విడుదల అవుతుంది. మరి అంతటి బిగ్ హాలీవుడ్ సినిమాతో పోటీ పడటం అంటే అది “ఏజెంట్” చిత్రానికి జరిగిన బిజినెస్, కలెక్షన్ల పై ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి ఏజెంట్ చిత్ర యూనిట్ అనుకున్నట్టుగా క్రిస్టమస్ కే వస్తారా లేక విడుదల తేదీని మార్చుకుంటారా అనేది చూడాలి.

Follow on Google News Follow on Whatsapp

READ  యాక్షన్ కింగ్ తో విశ్వక్ సేన్


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories