Homeసినిమా వార్తలుఎల్లలు దాటుతున్న పుష్ప క్రేజ్

ఎల్లలు దాటుతున్న పుష్ప క్రేజ్

- Advertisement -

సుకుమార్ – అల్లు అర్జున్ కలయికలో వచ్చిన పాన్ ఇండియా సినిమా “పుష్ప”. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కేవలం తెలుగులోనే కాకుండా మిగతా భాషల్లో కూడా భారీ స్థాయిలో రికార్డులను క్రియేట్ చేసి సంచలనం సృష్టించింది.అంతే కాకుండా ఈ సినిమాతో అల్లు అర్జున్ తన స్టార్ హోదా ఏమిటో నిరూపించుకున్నాడు.

అయితే కేవలం బాక్స్ ఆఫీస్ వద్ద మాత్రమే కాకుండా పుష్ప సినిమా టెలివిజన్లో కూడా భారీ స్థాయిలో రికార్డులు నమోదు చేయడం విశేషం. కేవలం మొదటిసారి మాత్రమే కాకుండా టెలికాస్ట్ అయిన మూడోసారి కూడా ఊహించని విధంగా మంచి TRPని సొంతం చేసుకుంది.ఈ సినిమాలో అల్లు అర్జున్ డైలాగులు,దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ప్రేక్షకులను విపరీతంగా అలరించాయి అలాగే సుకుమార్ అంచనాలకు తగ్గట్టుగా తనదైన హీరో క్యారెక్టర్ ను తయారు చేసి పకడ్బందీ స్క్రీన్ప్ ప్లే తో ఆకట్టుకున్నాడు.

ఇలా సినిమాలో అన్ని అంశాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అలాగే సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ కావడంతో ఇప్పుడు టీవీలలో కూడా రిపీట్ షోలు వేసుకుని చూస్తున్నారు. పుష్ప సినిమా మొదటిసారి టివిలో ప్రసారం అయినపుడు 22.54 టిఆర్పిని అందుకుంది. ఇక రెండవసారి 12.87 టిఆర్పి సొంతం చేసుకుంది. ఇక తాజాగా మూడోసారి టెలికాస్ట్‌ అవగా, 9.59 రేటింగ్‌ను దక్కించుకొని అందరి దృష్టిని ఆకర్షించింది.

READ  పక్కా కమర్షియల్ సినిమా చూసి మెచ్చుకున్న అల్లు అరవింద్
https://twitter.com/PushpaMovie/status/1542540740961529856?t=Q8kcto670ppBj6KqTSvuUw&s=19

కేవలం టీఆర్పీ రికార్డులే కాక సోషల్ మీడియాలో పుష్ప క్రేజ్ మామూలుగా లేదు. “పుష్ప అనుకుంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైరు” అన్న డైలాగ్ Instagram రీల్స్ లో స్టేటస్ లో తెగ వైరల్ అవగా..సామీ సామీ పాటను బాలీవుడ్ తారలు, తెలుగు హీరోయిన్లు దగ్గర నుంచి ప్రేక్షకుల వరకు కవర్ సాంగ్ లు విడియోలు చేశారు. ఇక పుష్ప సినిమాలో సమంత చేసిన ఊ అంటావా.. ఊ ఊ అంటావా పాట ఏ స్థాయిలో వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొత్తం భారత దేశాన్ని ఒక ఊపు ఊపేసింది.

పుష్ప సినిమా విడుదల అయి దాదాపు సంవత్సరం అయినా ఆ సినిమాకు ఉన్న క్రేజ్ ఇంచు కూడా తగ్గలేదు. ఈ రకంగా చూస్తే పుష్ప2 కు క్రేజ్ ఏ స్థాయిలో ఉండబోతుందో అంచనాలకు అందట్లేదు.ఇదిలా ఉంటే పుష్ప2 షూటింగ్ అనుకున్న దాని కంటే ఆలస్యంగా మొదలయ్యేలా ఉంది. నిజానికి పుష్ప2 చిత్రాన్ని ఈ ఏడాది చివర్లో విడుదల చేయాలని చిత్ర యూనిట్ అనుకున్నా, స్క్రిప్ట్ వర్క్ లో జాప్యం జరిగిన కారణంగా షూటింగ్ ఆలస్యం అవుతుంది. పుష్ప ఊహించిన దాని కంటే భారీ విజయాన్ని అందుకోవడంతో సుకుమార్‌ సీక్వెల్‌పై మరింత జాగ్రత్త వహిస్తున్నారు.ఆ కారణంగానే సినిమా చిత్రీకరణ ఆలస్యమవుతుందని తెలుస్తోంది.

READ  యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా రాబోతున్న రంగ రంగ వైభవంగా

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories