Homeసినిమా వార్తలుఇస్మార్ట్ శంకర్ తో హరీష్ శంకర్

ఇస్మార్ట్ శంకర్ తో హరీష్ శంకర్

- Advertisement -

హీరో రామ్ పోతినేని, కృతి శెట్టి జంటగా తమిళ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “ది వారియర్”. శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్స్ బ్యానర్ పై శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా జూలై 14 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్ లోని ఎన్ కన్వెన్షన్ లో గ్రాండ్ గా జరిగింది. ఇక ఈ ఈవెంట్ కు డైరెక్టర్ హరీష్ శంకర్ అతిధిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన చిత్ర యూనిట్ ను పొగడ్తలతో ముంచెత్తారు.

లింగుస్వామికి తాను పెద్ద ఫ్యాన్ నని.. ఆయన సినిమాలను థియేటర్లో ఎన్ని సార్లు చూశానని చెప్తూ.. రన్, పందెం కోడి, ఆవారా సినిమాలు ఎంత బాగుంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అని అన్నారు. యాక్షన్ సన్నివేశాలను ఎంతో అద్భుతంగా తెరకెక్కిస్తారని , అలాంటి దర్శకులు చాలా అరుదుగా లభిస్తారు అని హరిష్ శంకర్ సెలవిచ్చారు. ఇక హీరోయిన్ కృతి శెట్టి గురించి చెప్తూ ఈ మధ్య ఎక్కడ చూసినా ఆమె కనిపిస్తోందని.. ఈ సినిమాలో కృతి డాన్స్ అద్భుతంగా చేసిందని పేర్కొంటూ, ముందు ముందు ఆమె ఇంకా మంచి సినిమాలు చేయాలని ఆశిస్తున్నట్టు తెలిపారు.

ఇక హీరో రామ్ గురించి చెప్తూ, తనలో ఉన్న గొప్ప లక్షణం దర్శకులతో సరైన విధంగా నడుచుకోవడం అని చెప్పారు. తాను.. రామ్ కలిసి ఎన్నో సార్లు సినిమా చేయాలని అనుకున్న అది కుదరలేదని హరీష్ శంకర్ చెప్పారు.

READ  Modern love hyderabad web series: అభినందించదగ్గ ప్రయత్నమే అయినప్పటికీ ...

రామ్ లో ఉన్న మరో మంచి గుణం ఏంటంటే ఒక హీరోలా కాకుండా ఒక ప్రేక్షకుడిలా అలోచించి కథ వింటారని చెప్పిన హరీష్.. ఇదివరకు రామ్ కు కథ చెప్పిన విషయం చెప్తూ, అది ఒక సున్నితమైన ప్రేమకథతో పాటు అందులో ఇద్దరు హీరోలకి ప్రాధాన్యత ఉండిందని.. ఖచ్చితంగా అది రామ్ కి సరిపడే సినిమా అయితే కాదని.. అది విన్న తరువాత నచ్చలేదు అని చెప్పకుండా రామ్ చెప్పిన మాటలను హరీష్ చెప్తూ.. ” బ్రో ఈ కథ విన్నాకా ఫ్యాన్ మూడు లో ఉంది.. మనం కథ చేస్తే ఐదులో తిరగాలి” అన్నాడని చెప్పారు.అది తనకు బాగా నచ్చిందని చెప్పిన హరీష్, ఎప్పటికైనా రామ్ తో సినిమా చేస్తానని, అది ఎప్పుడు అని చెప్పలేను కానీ రామ్ తో ఖచ్చితంగా సినిమా చేస్తానని చెప్పుకొచ్చారు.

హీరో రామ్ ఎనర్జీకి పెట్టింది పెరైతే, హీరో పాత్రలకు మాంచి మాస్ యాటిట్యూడ్ ని జతచేసి ఆకట్టుకోవడంలో హరీష్ శంకర్ కు తిరుగు లేదు. వీరిద్దరూ కలిసి సినిమా చేస్తే అది ఖచ్చితంగా యూత్, మాస్ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.ఈ డబుల్ ఎనర్జీ కాంబో ఎప్పుడు కుదురుతుందో చూద్దాం.

READ  పవన్ కళ్యాణ్ - సముద్రఖని సినిమా ప్రారంభం

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories