Homeసినిమా వార్తలుఇక ఆలస్యం చేయనంటున్న కొరటాల శివ

ఇక ఆలస్యం చేయనంటున్న కొరటాల శివ

- Advertisement -

ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్ లో రెండవ సినిమా ప్రకటించి చాలా రోజులయింది. కానీ ఇప్పటివరకు ఈ సినిమా సెట్స్ పైకి రాలేదు. లెక్క ప్రకారం మే లేదా జూన్ నెలలో అయినా ఈ సినిమా సెట్స్ పైకి రావలసింది. కానీ జూలై నెల వచ్చేసినా ఇంకా సినిమా గురించి ఎలాంటి సమాచారం లేదు. దీనికి కారణం కొరటాల ఇంకా పూర్తిగా సిద్ధం కాకపోవడమే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు.

ఆచార్య డిజాస్టర్ దెబ్బతో కొరటాల ఇప్పుడు ఎన్టీఆర్ తో చేస్తున్న సినిమాకి సంభందించిన కథ పై మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఈసారి కచ్చితంగా హిట్ కొట్టాల్సిన పరిస్థితి కాబట్టి ఎన్టీఆర్ కోసం అనుకున్న స్క్రిప్ట్ కు మార్పుచేర్పులు చేస్తూ తుది మెరుగులు దిద్దుతున్నారట.అయితే కేవలం స్క్రిప్ట్ వర్క్ మాత్రమే ఈ సినిమా ఆలస్యానికి కారణం కాదని, ఆచార్య సినిమా వల్ల నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్ లతో కొరటాలకు ఇంకా లావాదేవిలు జరగాల్సి ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే ఆచార్య సినిమా విడుదలై దాదాపు మూడు నెలలు కావస్తుంది. ఇప్పటికీ ఆ సినిమా తాలూకు ఆర్థిక ఇబ్బందులు కొనసాగుతున్నాయి అంటే నమ్మశక్యంగా లేదని మరొక వాదన వినిపిస్తుంది. ఇక ఇలా రకరకాల పుకార్ల మధ్య వీలయినంత త్వరగా సినిమా మొదలు పెట్టడానికి కొరటాల సన్నద్ధం అవుతున్నారు.

READ  వైవిధ్యమైన నటిగా ఎదుగుతున్న రెజీనా కసాండ్రా

అటు ఎన్టీఆర్ కు కూడా కాస్త టైమ్ కావాలి. ఎందుకంటే, ఆర్ ఆర్ ఆర్ రిలీజ్ తర్వాత ఎన్టీఆర్ కాస్త లావెక్కారు. కొరటాల సినిమా కోసం సరైన లుక్ కోసం కనీసం రెండు నెలల సమయం పడుతుంది. ఈ చిన్న చిన్న ఇబ్బందులు అన్నీ. తొలగి తొందరలోనే ఈ హిట్ కాంబినేషన్ మరో బ్లాక్ బస్టర్ సొంతం చేసుకోవాలని కోరుకుందాం.

Follow on Google News Follow on Whatsapp

READ  మరో వెబ్ సీరీస్ తీసే ఆలోచనలో దర్శకుడు క్రిష్


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories