భారత దేశం చలన చిత్ర చరిత్రలో భారీ సినిమాగా వచ్చిన ఆర్ ఆర్ ఆర్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఏ స్థాయిలో సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దర్శకధీర రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా మరియు అద్భుతంగా తెరకెక్కించిన ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ ఇద్దరూ కూడా అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. ఇటివలే సినిమా వంద రోజులు పూర్తి చేసుకుంది.
కేవలం బాక్సాఫీస్ వద్ద మాత్రమే కాకుండా ఓటీటీ లోనూ ఆర్ ఆర్ ఆర్ ఒక చరిత్ర సృష్టించింది. ఓటిటీలో ఈ సినిమాకు భారీ స్థాయిలో స్పందన లభించింది. ముఖ్యంగా నెట్ ఫ్లిక్స్ లో హిందీ వెర్షన్ ను ఈ సినిమాను అత్యధిక వీక్షకులు వీక్షించారు. ప్రముఖ హాలీవుడ్ టెక్నీషియన్స్ తో పాటు సాధారణ విదేశీ ప్రేక్షకులు కూడా సినిమాను చూసి అద్భుతంగా ప్రశంసల జల్లులు కురిపించారు. అసలు సోషల్ మీడియా మొత్తం గత కొంతకాలంగా ఎక్కడ చూసినా కూడా ఆర్ ఆర్ ఆర్ సినిమాకు సంబంధించిన చర్చల, రివ్యూలతో నిండిపోయింది.
ఇక ఆర్ ఆర్ ఆర్ ఓటిటిలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో జీ5 లో స్తీమింగ్ అవుతుండగా, హిందీ వెర్షన్ హక్కులను నెట్ ఫ్లిక్స్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇక నెట్ ఫ్లిక్స్ లో ఆర్ ఆర్ ఆర్ సినిమా అత్యధిక ప్రేక్షకులు వీక్షించిన సినిమాగా చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ధియేట్రికల్ రన్ తరువాత ఓటిటి లోనూ రికార్డులు సృష్టిస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా ఇప్పుడు మరో రికార్డును తన ఖాతాలో జమ చేసుకుంది.
ఇప్పటికే జీ 5 మరియు నెట్ ఫ్లిక్స్ లో ప్రదర్శింపబడుతున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా ఇప్పుడు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో హాట్ స్టార్ (Disney+Hotstar) లో కూడా స్ట్రీమింగ్ కు సిద్ధం అయింది. ఓకే సినిమా ఇలా మూడు స్ట్రీమింగ్ ఛానెల్స్ లో ప్రదర్శింపబడటం ఇదే తొలిసారి కావడం విశేషం.