Homeసినిమా వార్తలుఆత్రేయ మళ్ళీ వస్తాడు అంటున్న విక్రమ్ కుమార్

ఆత్రేయ మళ్ళీ వస్తాడు అంటున్న విక్రమ్ కుమార్

- Advertisement -

ఇష్క్, మనం, 24 వంటి సినిమాలతో మెప్పించిన దర్శకుడు విక్రమ్ కే కుమార్. తమిళ ఇండస్ట్రీ నుండి వచ్చి తెలుగులో వరుస సినిమాలు తీసిన ఆయన చివరిగా నానితో తీసిన “గ్యాంగ్ లీడర్” చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆడకపోయినా విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

ప్రస్తుతం అక్కినేని నాగచైతన్య తో థాంక్యూ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా జులై 22న విడుదల కానుంది. ఈ సినిమా ప్రచారంలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలలో తాను హీరో సూర్యతో తీసిన 24 సినిమాకి సీక్వెల్ ఉంటుందని ప్రకటించారు. సూర్య హీరోగా మూడు విభిన్న పాత్రలలో కనిపిస్తూ టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో వచ్చిన 24 సినిమా ప్రేక్షకుల నుంచి చక్కని స్పందనను రాబట్టుకుంది.

ఈ సందర్భంగా ఆయన మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పడం జరిగింది. ఆయన తదుపరి తీయబోయే తెలుగు సినిమా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో ఉంటుంది అని తెలియజేశారు. న్యాచురల్ స్టార్ నానితో విక్రమ్ కుమార్ తెరకెక్కించిన ” గ్యాంగ్ లీడర్” కూడా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లోనే తీశారు. ఇక మైత్రి బ్యానర్ లో తెరకెక్కుతున్న సినిమానే కాక బాలీవుడ్ లో ఒక యాక్షన్ సినిమా చేయనున్నారని కూడా విక్రమ్ తెలిపారు. థాంక్యూ చిత్రం తరువాత ఆ కథపై కసరత్తు మొదలు పెడతానని.. ఇంత వరకూ ఆయన చేయని కథతో ఆ సినిమా ఉంటుందని ఆయన అన్నారు.

READ  సినీ కార్మికుల సమ్మె పై స్పందించిన నరేష్

ఇక ఇదే క్రమంలో 2016 లో వచ్చిన 24 సినిమా గురించి విక్రమ్ మాట్లాడారు. ఆ సినిమా సీక్వెల్ కు సంభందించి తనకు కొన్ని ఆలోచనలు ఉన్నాయని.. ఎప్పుడు తీస్తానో తెలియదు కానీ ఖచ్చితంగా 24 సినిమాకు సీక్వెల్ తీస్తానని ఆయన చెప్పారు. విక్రమ్ కుమార్ చెప్పిన ఈ విషయం విని సూర్య అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. ఆత్రేయ పాత్రలో మళ్ళీ తమ హీరోను చుడాలని వారు తహతహ లాడుతున్నారు. ఇటీవలే కమల్ హాసన్ – లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో వచ్చిన ” విక్రమ్” లో కూడా సూర్య సినిమా చివరలో రోలెక్స్ అనే విలన్ పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే.

Follow on Google News Follow on Whatsapp

READ  హ్యాట్రిక్ కొట్టనున్న పూరి -విజయ్ దేవరకొండ


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories