Homeసినిమా వార్తలుTelugu Film Industry: ఆగస్టు 1 నుంచి షూటింగులు బంద్

Telugu Film Industry: ఆగస్టు 1 నుంచి షూటింగులు బంద్

- Advertisement -

మొత్తానికి అందరూ అనుకున్నట్లే అయ్యింది. ఆగస్టు 1 నుండి సినిమా షూటింగ్లను నిలిపి వేస్తున్నట్లు నిర్మాతల మండలి నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు తెలిపారు. తాజాగా తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ లో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్ల సమావేశం జరిగింది, ఆ సమావేశంలో తుది నిర్ణయాన్ని కమిటీకి వదిలేశారు. అయితే, అనూహ్యంగా నిర్మాతల మండలి కీలక నిర్ణయాలు తీసుకుంటూ ప్రకటన విడుదల చేసింది. ఇటీవల కార్యవర్గ సమావేశంలో చర్చించిన 8 కీలక అంశాలపై పలు నిర్ణయాలు తీసుకున్నారని తెలుస్తోంది.


ఓటీటీ, వీఎఫ్ఎక్స్ చార్జీలు, సినిమా టికెట్ ధ‌ర‌ల వంటి ప‌లు అంశాల‌పై చ‌ర్చించి ప‌లు నిర్ణ‌యాలు తీసుకున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా భారీ బడ్జెట్ సినిమాల‌ను థియేట‌ర్‌లో విడుద‌లైన 10 వారాల త‌ర్వాతే ఓటీటీకి ఇవ్వాల‌ని నిర్ణ‌యించారట. ఇక చిన్న బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన సినిమాల‌ను 4 వారాల త‌ర్వాత ఓటీటీలో విడుదల చేయవచ్చని కమిటీ పేర్కొందట. సినిమా ప్ర‌ద‌ర్శ‌న‌కు వీఎఫ్ఎక్స్ చార్జీలను ఎగ్జిబిట‌ర్లే చెల్లించాల‌నే నిర్ణయం కూడా తీసుకున్నారట.


అలాగే ఇటీవల భారీ స్థాయిలో పెరిగిపోయిన సినిమా టికెట్‌ ధరలను సామాన్యులకు అందుబాటులో ఉంచాలని తెలంగాణ ఫిల్మ్‌ ఛాంబర్‌ ప్రతిపాదించింది. నగరాలు, పట్టణాల్లో సాధారణ థియేటర్లు, సి-క్లాస్‌ సెంటర్లలో టికెట్‌ ధరలు రూ.100, రూ.70(జీఎస్టీతో కలిపి)గా ఉంచాలని ప్రతిపాదించారు. ఇక మల్టీప్లెక్స్‌లో జీఎస్టీతో కలిపి రూ.125 ఉండేలా ప్రతిపాదనలు చేశారు. మీడియం బడ్జెట్‌, మీడియం హీరో సినిమాలకు టికెట్‌ ధర నగరాలు/పట్టణాల్లో రూ.100 ప్లస్‌ జీఎస్టీ ఉండాలని, అదే సి-సెంటర్లలో రూ.100 (జీఎస్టీతో కలిపి) ఉండాలని, మల్టీప్లెక్స్‌లో అత్యధికంగా రూ.150 ప్లస్‌ జీఎస్టీతో మాత్రమే ఉండాలని ప్రతిపాదించారు.

READ  Box-Office : తెలుగులో విక్రమ్ ప్రభంజనం


అయితే అనుకున్నది అనుకున్నట్లుగా ఈ టికెట్ రెట్లు అమలు అవుతాయో లేదో చూడాలి. ఇక షూటింగ్ లను ఆపివేసే నిర్ణయంలో కూడా ఒక చిన్న సవరణ చేసినట్లుగా తెలుస్తోంది. అదేంటంటే 70 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమాలు యధావిధిగా షూటింగ్ లను కొనసాగించవచ్చని ఈ సమావేశంలో నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. దీని వల్ల కేవలం కొత్తగా షూటింగ్ ప్రారంభించే సినిమాలకు మాత్రమే కాస్త ఇబ్బంది ఉంటుంది. ఇదివరకే షూటింగ్ ప్రారంభించిన సినిమాలకు ఎలాంటి ఇబ్బందీ ఉండదు. కాగా ఈ షూటింగ్లను ఆపివేసే నిర్ణయం అంతే నిక్కచ్చిగా పాటిస్తారా లేదా అనేది కూడా ఒక సందేహమే.

Follow on Google News Follow on Whatsapp

READ  OTTలో హిట్ కొట్టిన సుందరం


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories