Homeసినిమా వార్తలుTelugu Cinema: అసలు సమస్య ఎంటో ఇప్పటికీ తెలుసుకోలేక పోతున్న నిర్మాతలు

Telugu Cinema: అసలు సమస్య ఎంటో ఇప్పటికీ తెలుసుకోలేక పోతున్న నిర్మాతలు

- Advertisement -

ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమ పరిస్తితి ఏమాత్రం బాగోలేదు. పైకి అంతా బాగానే కనిపిస్తున్నా పలు రకాల సమస్యలతో సతమతం అవుతోంది అనేది వాస్తవం . ఒక సమస్య వదిలిందనుకుంటే మరొకటి మొదలవుతుంది. కరోనా వైరస్ కారణంగా ఏకంగా రెండేళ్ల పాటు సినిమాలు విడుదల చేయలేక పరిశ్రమ చాలా నష్టాలను చవి చూసింది . చాలా సినిమాల షూటింగ్‌లు నిలిచిపోవటం వలన నిర్మాతలు దెబ్బతిన్నారు. అలాగే పరిశ్రమ మీద ఆధారపడిన ఇతర రంగాల వారు కూడా నష్టపోయారు.

అయితే కరోనా రెండు వేవ్‌ల తర్వాత ఆ ప్రభావం సన్నగిల్లడంతో మళ్ళీ సినిమా నిర్మాణం, విడుదల చేయడం అన్ని పనులు తిరిగి ప్రారంభం అవడంతో ఇండస్ట్రీ వర్గాలు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. హమ్మయ్య ఇక గాడిన పడుతుందని భావించారు. ఇక సమస్యలు ఏవీ లేకుండా హాయిగా వ్యాపారాన్ని చక్కదిద్దుకోవచ్చని అందరూ భావించారు. అయితే, కరోనా కారణంగా నష్టపోయిన వ్యాపారం తిరిగి లాభాల పాట పట్టాలనే ఉద్దేశ్యంతో ఒక తొందరపాటు నిర్ణయం తీసుకుని పెద్ద తప్పు చేశారు నిర్మాతలు.

చాలా రోజుల గ్యాప్ తర్వాత వస్తున్న పెద్ద హీరోల సినిమాలకు డబ్బులు ఖర్చు పెట్టడానికి అభిమానులు, సినిమా పిచ్చి ఉండే ప్రేక్షకులు ఎంత మాత్రం ఆలోచించరు గనక వారి పిచ్చి ప్రేమను క్యాష్ చేసుకునే ఆలోచనతో నిర్మాతలు అత్యాశకు పోయి సినిమా టికెట్ రేట్లు విపరీతంగా పెంచేశారు. రకరకాల కారణాలు చూపించిన ఇష్టం వచ్చినట్లుగా రేట్లు పెంచుకున్నారు. పెరిగిన టికెట్ రేట్లు పాన్ ఇండియా సినిమాలకు కొంతవరకూ లాభం తెచ్చిపెట్టినప్పటికీ, చాప కింద నీరులా ఈ టికెట్ రెట్లు ఒక వర్గం ప్రేక్షకులను సినిమాకు దూరం చేశాయి అనడంలో ఎలాంటి అనుమానం లేదు.

READ  సమ్మర్ రిలీజ్ కన్ఫర్మ్ అంటున్న సూపర్ స్టార్

రాధేశ్యామ్, ఆచార్య, సర్కారు వారి పాట లాంటి సినిమాలకి 250-300 రేట్లతో టికెట్ల అమ్మకం జరిగింది. ఒక్కో టికెట్ రూ.300 లేదా 350 అంటే నలుగురు కుటుంబ సభ్యులు వెళ్లాలంటే సుమారు రూ.1500 దాకా ఖర్చు అవుతుంది. ఆ తర్వాత వచ్చిన ఎఫ్ 3 అయితే రూ.295, నాని నటించిన అంటే సుందరానికి కూడా అవే టికెట్ రేట్లు అమలులో ఉన్నాయి. దీంతో ప్రేక్షకులు ఇంక థియేటర్లకు వెళ్లి సినిమా చూసే కంటే కొన్ని రోజులు వేచి చూసి ఓటీటీ లోనే చూసుకోవచ్చు అనే నిర్ణయానికి వచ్చేశారు.

కళ్ళ ముందు ఇంత పెద్ద సమస్యను పెట్టుకుని నిర్మాతలు ఈ విషయాన్ని మాత్రం అస్సలు పట్టించుకోకుండా .. హీరోల రెమ్యునరేషన్ గురించీ, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ల జీతభత్యాల గురించీ వాపోతున్నారు. అంతే తప్ప ఒక్క తాటి పై అందరూ ఉండి టికెట్ రేట్లను ఖరాఖండిగా నిర్ణయించకుండా విడుదల అయ్యే ప్రతి సినిమాకి రేట్లు ఎక్కువ తక్కువ అని ప్రచారం చేసుకుంటూ తమ పరువు తామే తీసుకుంటున్నారు.

READ  మరో హిట్ కొట్టిన సాయి పల్లవి: గార్గి ప్రీమియర్ షో టాక్ సూపర్

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories