Homeసినిమా వార్తలుఅరుదైన గౌరవం దక్కించుకున్న కార్తీకేయ -2 టీమ్

అరుదైన గౌరవం దక్కించుకున్న కార్తీకేయ -2 టీమ్

- Advertisement -

నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా న‌టించి..విడుదలకు సిద్ధంగా ఉన్న తాజా చిత్రం “కార్తికేయ 2”. చందూ మొండేటి దర్శకత్వంలో వ‌స్తున్న ఈ చిత్రంలో అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ హీరోయిన్ గా నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఇందులో ఒక ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయడానికి చిత్ర యూనిట్ అన్ని సన్నాహాలు చేస్తున్నారు.

కార్తికేయ 2 టీం జూలై 19న ప్ర‌పంచ‌ ప్ర‌ఖ్యాత ISKCON ఆర్గ‌నైజేష‌న్‌ను సంద‌ర్శించ‌నుంది. యూపీలోని ఆర్గ‌నైజేష‌న్‌ను సంద‌ర్శించి.. అక్కడి భక్తులతో శ్రీ కృష్ణుని మహిమలు, జీవిత విశేషాలను ఏ రకంగా సినిమాలో స్పూర్తిగా తీసుకున్నారు అనే అంశాలపై చర్చలో పాల్గొనడానికి కోల్‌క‌తా ISKCON వైస్ ప్రెసిడెంట్ రాధారామ్ దాస్ కార్తికేయ 2 టీంను ఆహ్వానించటం విశేషం. ఈ విష‌యాన్ని నిఖిల్ ట్విట‌ర్ ద్వారా షేర్ చేశారు. హిందీ, తమిళ్, మలయాళ మరియు కన్నడ వెర్షన్ల టీజర్లను అక్కడ విడుదల చేయ‌నున్న‌ట్టు చెప్పారు నిఖిల్‌.

కార్తికేయ 2 లో ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్‌ ఖేర్ తో పాటు ఆదిత్యా మీన‌న్‌, హ‌ర్ష చెముడు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కాలభైరవ సంగీతం అందిస్తున్నారు. కార్తీక్‌ ఘట్టమనేని కెమెరామెన్‌. కార్తికేయ 2 ను పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్ బ్యాన‌ర్ల‌పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి చందు మొండేటి కథ – స్క్రీన్ ప్లే అందించడంతో పాటు దర్శకత్వం వహిస్తున్నారు.

READ  చిరంజీవి సినిమా నుంచి తప్పుకున్న రవితేజ?

ప్రస్తుతం ప్రేక్షకులకి సినిమా అంటే అయితే భారీ బడ్జెట్ చిత్రం అయినా అయి ఉండాలి లేదా ఏదో ఒక ఆసక్తికరమైన విషయం ఉంటేనే సినిమాను చూడడానికి ఇష్టపడుతున్నారు. ఆ రకంగా చూసుకుంటే కార్తీకేయ 2 సినిమాకి సీక్వెల్ అనే అంశంతో పాటు ద్వారకా నేపథ్యంలో శ్రీ కృష్ణుని జీవితం గురించిన రహస్యాన్ని కథగా ఎంచుకోవడం వల్ల చక్కని హైప్ మరియు భారీ అంచనాలు నెలకొన్నాయి.

Follow on Google News Follow on Whatsapp

READ  777 చార్లీ చిత్రం చూసి కంటతడి పెట్టుకున్న కర్ణాటక ముఖ్యమంత్రి


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories