Homeసినిమా వార్తలునితిన్ తప్పేమీ లేదు: అమ్మ రాజశేఖర్ పై మండి పడుతున్న నితిన్ అభిమానులు

నితిన్ తప్పేమీ లేదు: అమ్మ రాజశేఖర్ పై మండి పడుతున్న నితిన్ అభిమానులు

- Advertisement -

ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ అమ్మ రాజశేఖర్.. ఇటీవల తను దర్శకత్వంలో తెరకెక్కిన “హై ఫైవ్” చిత్ర ప్రి రిలీజ్ ఈవెంట్ లో హీరో నితిన్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తానే స్వయంగా నిర్మించిన సినిమా ఈవెంట్ కి హీరో నితిన్ ను గెస్ట్ గా పిలిచినా నితిన్ రాకపోవడంతో ఆ వేడుకలో మాట్లాడుతూ అమ్మ రాజశేఖర్ నితిన్ ని ఉద్దేశించి ఆవేశంగా మాట్లాడారు.

అమ్మ రాజశేఖర్ మాట్లాడుతూ… “ఒకానొక సమయంలో నితిన్ కి అసలు ఎలా డాన్స్ చేయాలి అనేది కూడా తెలియదు. నేను నేర్పించాను. నన్ను గురువుగా భావించి గౌరవిస్తాడని అనుకున్నాను కానీ ఈరోజు ఈవెంట్ కి పిలిచినా రాలేదు” అని అన్నారు రాజశేఖర్. హీరోగా మంచి పేరు తెచ్చుకున్నాక నితిన్ తనని అవమానించాడనీ, షూటింగ్స్ ఏమీ లేకపోయినా కేవలం ఇంట్లో కూర్చుని రాలేదని బాధపడ్డారు.

అలాగే పది రోజుల క్రితమే నితిన్‌ను ఈ ప్రోగ్రామ్‌కు రావాల్సిందిగా ఆహ్వానించానని ఆయన చెప్పారు. నితిన్ వస్తానని మాట కూడా ఇస్తే ఆ మాట నమ్మి అన్నం కూడా తినకుండా కష్టపడి నితిన్‌ కోసం ప్రత్యేకంగా ఏవీ క్రియేట్‌ చేయిస్తే ఈవెంట్ కు నితిన్ రాలేదని ఆయన వాపోయారు.

READ  OTT Release: విరాట పర్వం ఓటిటి రిలీజ్ ఎప్పుడంటే..

గురువులాంటి నాపై గౌరవంతో వస్తారని భావించానని.. కానీ నితిన్ ఇంట్లో ఉండి కూడా ఇక్కడికి రాలేదు. ఫోన్‌ చేస్తే జ్వరమని చెప్పగా, కనీసం వీడియో బైట్‌ అయినా పంపమని కోరుతే. అది కూడా ఇవ్వలేదని చెప్తూ..”ఒరేయ్ నితిన్ నీ విషయంలో నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. నిన్ను నేను నమ్మాను. లైఫ్ లో నిన్ను ఎప్పుడైనా కలిస్తే మళ్ళీ అప్పుడు చూద్దాం,” అని నితిన్ పై మండిపడ్డారు.

అయితే ఈ విషయంలో నితిన్ అభిమానులు అన్న రాజశేఖర్ పై కోపంతో ఉన్నారు. అసలు నువ్వు తీసిన టక్కరి సినిమా పెద్ద డిజాస్టర్.. నువ్వు నితిన్ కు డాన్స్ నేర్పడం ఏంటని ప్రశ్నించారు. అలాగే “హై 5” ట్ట్రైలర్ చూస్తే అదొక అడల్ట్ కంటెంట్ ఉన్న సినిమాలా కనిపిస్తుంది. కాబట్టే నితిన్ అలాంటి సినిమాని ప్రమోట్ చేయడం ఇష్టం లేక వేడుకకి రాలేదని చెబుతున్నారు.

Follow on Google News Follow on Whatsapp

READ  ఓటీటీ లో జయమ్మ పంచాయితీ


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories