Homeసినిమా వార్తలుఅన్నదమ్ములుగా కనిపించనున్న మెగాస్టార్ - మాస్ మహరాజ్

అన్నదమ్ములుగా కనిపించనున్న మెగాస్టార్ – మాస్ మహరాజ్

- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ తరువాత మూడు చిత్రాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే అందులో రెండు సినిమాలు రీమేక్ గా రూపొందుతున్నాయి. ఒకటి మలయాళ సూపర్ హిట్ సినిమా ‘లూసీఫర్’ ఆధారంగా తెరకెక్కిస్తున్నారు ‘గాడ్ ఫాదర్’ టైటిల్ తో రాబోతున్న ఈ సినిమాకి మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. ఇక తమిళ సూపర్ స్టార్ అజిత్ హీరోగా నటించిన ‘వేదాళం’ ఆధారంగా ‘భోళా శంకర్’ తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక బాబి డైరెక్ట్ చేస్తున్న మూడవ సినిమా మాత్రం స్ట్రెయిట్ సినిమాగా రూపొందుతోంది.’వాల్తేరు వీరయ్య’ అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత భారీ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా నిర్మిమిస్తున్నారు. అందుకే గాడ్ ఫాదర్ మారుతూ భోళా శంకర్ సినిమాల కంటే ఈ చిత్రానికే అటు అభిమానుల్లో ఇటు ప్రేక్షకుల్లో భారీ క్రేజ్ ఏర్పడింది. అందుకో మరో కారణం కూడా ఉంది. అదేంటంటే ఈ సినిమాలో మెగాస్టార్ తో కలిసి మాస్ మహారాజా రవితేజ నటిస్తుండటమే. ఈ చిత్రంలో ఒక కీలక పాత్రలో రవితేజ కనిపించబోతున్నారు. అయితే ఇందులో రవితేజ ఏ పాత్రలో నటించబోతున్నారు? .. ఆయన పాత్రకు చిరంజీవి పాత్రకున్న సంబంధం ఏంటీ? అన్న సందేహాలు గత కొన్ని రోజులుగా రవితేజ అభిమానులు మరియు మెగా అభిమానులలో తలకెత్తాయి.

READ  Box-office: మరో రికార్డ్ కొట్టిన విక్రమ్

ఇటీవలే సినిమా సెట్స్ లోకి రవితేజ అడుగు పెట్టిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని చిత్ర బృందం ఓ వీడియో ద్వారా వెల్లడించారు. ఆ వీడియోలో చిరంజీవి కారవాన్ డోర్ ఓపెన్ చేసి చేయి అందించడం, బదులుగా రవితేజ కన్ను గీటడం ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకుంది. ఆ వీడియోకు బ్యాక్ గ్రౌండ్ లో శంకర్ దాదా ఎంబీబీఎస్ టైటిల్ సాంగ్ తో పాటు మాస్ తో పెట్టుకుంటే మడతడి పొద్ది పాట రీమిక్స్ గా రావడం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.

ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికరమైన వార్త ఒకటి బయటికి వచ్చింది. రవితేజ మెగాస్టార్ ల పాత్రలు ఎలా వుంటాయి. వాళ్లిద్దరి మధ్య వున్న సంబంధం ఏంటీ అన్న విషయంలో తాజాగా ఒక అందమైన పుకారు బయటికి వచ్చింది.

ఈ సినిమాలో చిరంజీవి – రవితేజ సవతి సోదరులుగా కనిపించబోతున్నారట. ఇద్దరి తండ్రి ఒక్కడైనా తల్లులు మాత్రం వేరే అని, అలాగే ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ సవతి తమ్ముడిగా కనిపించనున్నారని తెలిసింది. ఇక ఇద్దరి మధ్య మాస్ ప్రేక్షకులని ఉర్రూతలూగించేలా హై వోల్టేజ్ ఫైట్ లు మరియు సన్నివేశాలు దర్శకుడు బాబి ప్లాన్ చేశారని తెలుస్తోంది. ఈ వార్త ఇద్దరి అభిమానులకు ఆనందం తెప్పించడమే కాకుండా సినిమా పై అంచనాలు భారీగా పెరగడం ఖాయం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

గతంలో రవితేజ ‘అన్నయ్య’ సినిమాలో చిరంజీవి సోదరుడిగా నటించిన విషయం తెలిసిందే. శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో రవితేజకు జోడీగా కేథరిన్ నటిస్తున్నారని సమాచారం. ఇక ఈ చిత్రంలో రవితేజ పాత్ర నిడివి దాదాపు 30 నిమిషాల పాటు వుంటుందని చెబుతున్నారు. ఇక ఈ సినిమాలోని ఇతర ముఖ్య పాత్రల్లో బాబీ సింహా, రాజేంద్ర ప్రసాద్ మరియు వెన్నెల కిషోర్ నటిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా ఆర్థర్ ఏ. విల్సన్, ఎడిటింగ్ నిరంజన్ దేవరమానె, సంగీతం దేవిశ్రీప్రసాద్.

READ  ఆచార్య ఫలితంతో నాకు సంబంధం లేదన్న చిరంజీవి

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories