Home సినిమా వార్తలు లైగర్ – సాలా క్రాస్‌బ్రీడ్ ట్రైలర్ రివ్యూ

లైగర్ – సాలా క్రాస్‌బ్రీడ్ ట్రైలర్ రివ్యూ

యువ స్టార్ హీరో హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో.. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా “లైగర్”. ఈ సినిమా పై అంచనాలు భారీగానే ఉన్నాయి. బాక్సింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో ఒక చాయివాలా నుండి బాక్సర్‏గా ఎదిగిన పాత్రలో విజయ్ కనిపించనుండగా.. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే కథానాయికగా నటిస్తున్నారు. అలాగే ప్రఖ్యాత బాక్సర్ మైక్ టైసన్ ఈ చిత్రంలో ఒక ప్రత్యేక పాత్రలో నటిస్తుండటం విశేషం.

పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ”లైగర్”(సాలా క్రాస్‌బ్రీడ్) కు చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాలను మొదలుపెట్టింది.ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను జూలై 21న అన్ని భాషల్లో విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇదివరకే ప్రకటించారు. ఆ పోస్టర్ తోనే సినిమా చూడాలి అన్న ఆతృత పెంచేశారు అని చెప్పవచ్చు.

ఇక అందరూ ఎంతో ఆసక్తితో ఎదురు చూసిన లైగర్ ట్రైలర్ వచ్చేసింది. ముందుగా చెప్పుకున్నట్టు విజయ్ ఇందులో బాక్సర్ గా కనిపిస్తున్నారు. ఇక ట్రైలర్ లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది యాక్షన్ సన్నివేశాలు.. సినిమాలో ఫైట్ లు ఏ స్థాయిలో ఉండబోతున్నాయి ఊహించే విధంగా ట్రైలర్ ను కట్ చేయడం జరిగింది. ఇక హీరో తల్లిగా రమ్యకృష్ణ పక్కా మాస్ రోల్ లో కనిపిస్తున్నారు. హీరోయిన్ అనన్య పాండే తన అందాలతో కనువిందు చేయగా.. ట్రైలర్ చివరలో “నువ్వు ఫైటర్ వి అయితే మరి నేనెవరిని” అంటూ ప్రఖ్యాత బాక్సర్ మైక్ టైసన్ కనిపించడం విశేషం.

భారీ అంచనాలతో విడుదల కాబోతున్న లైగర్ చిత్రాన్ని పూరి కనెక్ట్స్ , బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్ సారథ్యంలో ధర్మా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా సంయుక్తంగా సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ , మలయాళం భాషల్లో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా చిత్రం 2022 ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version