Home సినిమా వార్తలు రెమ్యునరేషన్ల విషయంలో నిర్మాతల ఆలోచన సరైనదేనా?

రెమ్యునరేషన్ల విషయంలో నిర్మాతల ఆలోచన సరైనదేనా?

Tollywood Producers

గత కొంత కాలంగా తెలుగు సినీ నిర్మాతలు.. పరిశ్రమ ఎదురుకుంటున్న సమస్యల పై చర్చలు మరియు పలు నిర్ణయాలు తీసుకునే ఆలోచన చేస్తున్న విషయం తెలిసిందే. ఓ వైపు కరోనా వల్ల షూటింగ్ లు ఆగిపోయి నిర్మాణ వ్యయం పెరిగిపోయి నిర్మాతలు చాలా వరకు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. మరో వైపు ఓటీటీల ప్రభావం పెరిగిపోవడంతో ప్రేక్షకులు థియేటర్లకు రావాలంటే ఆలోచించే పరిస్తితి ఏర్పడటం, ముఖ్యంగా పెరిగిన టికెట్ రేట్ల కారణంగా సినిమా థియేటర్లకు ప్రేక్షకులు రావడానికి ఆసక్తిని చూపించడం లేదనే భావన అటు ఇండస్ట్రీ వర్గాల్లోనూ.. ఇటు సినీ విమర్శకులు మరియు ట్రేడ్ వర్గాల్లోనూ ఉంది.

ఇక సినిమా బడ్జెట్ ను కాస్త తగ్గించి సినిమాలు నిర్మించే ప్రయత్నం చేయాలంటే స్టార్ హీరోలు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ల రెమ్యునరేషన్ భారీగా పెంచేశారని నిర్మాతలు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో తాజా సమస్యలన్నింటినీ ఓ కొలిక్కి తీసుకురావాలన్న ఆలోచనతో నిర్మాతలు ఆగస్టు ఒకటో తారీఖు నుంచి సినిమాల షూటింగ్ లని నిరవధికంగా ఆపి వేయాలనే ఆలోచనకు వచ్చాయి.

ఈ మేరకు సోమవారం నిర్మాతల మండలి అత్యవసర భేటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ మీటింగ్ లో ఓటీటీ లో సినిమాల రిలీజ్ లతో పాటు టికెట్ రేట్ల పై అలాగే ఇతర సమస్యల పై చర్చించారట. అయితే ఓటీటీల్లో సినిమాల రిలీజ్ లపై మాత్రం నిర్మాతలు అందరూ ఏకాభిప్రాయానికి రాలేదనే వార్తలు వినిపించాయి. దీంతో 27న మరోసారి నిర్మాతల మండలి సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించాలని తలపెట్టింది.

అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, రెమ్యునరేషన్ అనేది అయా నటుడు లేదా హీరో.. తనతో చిత్రం నిర్మించే నిర్మాతతో చర్చించుకుని తీసుకునే నిర్ణయం పరస్పరం లాభాలు మరియు నష్టాలు లెక్కించుకుని జరిగే ఒప్పందం. దాన్ని ఇలా ఏదో ఆఫీసులో జీతాలు నిర్ణయించినట్టుగా చర్యలు తీసుకోవడం లేదా ఫలానా అమౌంట్ వరకే ఇవ్వాలి అనడం ఏమాత్రం సబబు కాదు. అది అసలు కుదరని పనిగా చెప్పవచ్చు.

ఎందుకంటే ప్రస్తుతం యువ హీరోలు కూడా ప్యాన్ ఇండియా స్థాయిలో చిత్రాలు చేస్తున్నారు. అందుకు వారు శారీరకంగా మరియు మానసికంగా ఎంతో కష్టపడుతూ విలువయిన సమయాన్ని కూడా ప్రచార నిమిత్తం వెచ్చిస్తున్నారు. మరి ఆ కష్టానికి ధర వారు నిర్ణయించడమే సరైన పద్ధతి. ఏదైనా బేరం చేసి తగ్గించాలంటే అది సదరు సినిమా నిర్మాత చేయాలి కానీ ఇలా ఎన్ని మీటింగ్ లు పెట్టి ఎన్ని తీర్మానాలు చేసినా లాభం ఉండదు అందువల్ల జరిగే మార్పూ ఏదీ ఉండదు.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version