Home సినిమా వార్తలు రామారావు అన్ డ్యూటీ ప్రి రిలీజ్ బిజినెస్ డిటైల్స్

రామారావు అన్ డ్యూటీ ప్రి రిలీజ్ బిజినెస్ డిటైల్స్

మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం రామారావు ఆన్ డ్యూటీ జులై 29 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. శరత్ మాండవ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ర‌వితేజ ఎం.ఆర్‌.ఓ ఆఫీస‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. ఓ సిన్సియ‌ర్ గ‌వ‌ర్న‌మెంట్ ఆఫీస‌ర్ తన విధి నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులను ఎదురుకుని తన బాధ్యతను నిర్వర్తించారు అనేదే ఈ సినిమా. ఇందులో ర‌జిషా విజ‌య‌న్‌, దివ్యాంశ కౌశిక్ హీరోయిన్లుగా నటించారు.

ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పాటలు, ట్రైలర్ , టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కాగా ఈ చిత్రం ప్రి రిలీజ్ ఈవెంట్ నిన్న అంటే ఆదివారం చాలా ఘనంగా హైదరాబాద్ – ఫిల్మ్ నగర్ జేఆర్సీ కన్వెన్షన్ లో జరిపించారు చిత్ర బృందం. ఈ ప్రి రిలీజ్ ఈవెంట్ కు నాచురల్ స్టార్ నాని ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఇక ఈ చిత్ర ప్రి రిలీజ్ బిజినెస్ ను అందరికీ లాభసాటిగా బేరంగా చేశారు. నైజాం హక్కులు 5.5 కోట్లకు జరపగా, సీడెడ్ హక్కులను 3.2 కోట్లకు జరిగింది. ఇక ఆంధ్రా రాష్ట్ర రేషియో 7.5 కోట్లకు జరిపారు. మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల బిజినెస్ 16 కోట్లకు, వరల్డ్ వైడ్ బిజినెస్ 18 కోట్లకు జరిగింది. మంచి టాక్ వస్తే ఈ అమౌంట్ రికవర్ అవడం పెద్ద కష్టమేమీ కాదు.

శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి, రవితేజ టీం వర్క్స్ బ్యానర్స్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాను జూలై 29న భారీ స్థాయిలో విడుదల చేయబోతున్నారు. ఇప్పటివరకు వదిలిన ఈ చిత్ర ప్రచార కార్యక్రమాలకు లభించిన ఆదరణ చూస్తుంటే ఈ సినిమాతో రవితేజ మరోసారి బ్లాక్ బస్టర్ అందుకోబోతున్న సూచనలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

1995 నాటి నేపథ్యంలో యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రవితేజ సరసన రజిషా విజయన్, దివ్యాంశ కౌశిక్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అదే కాకుండా ఈ సినిమాతోనే ఒకప్పటి నటుడు తొట్టెంపూడి వేణు ఇన్నేళ్ల తరువాత వెండితెరపై కనిపించనున్నారు. ఇతర ముఖ్యమైన పాత్రల్లో నాజర్ .. పవిత్ర లోకేశ్ కనిపించనున్నారు

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version