మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. తాజాగా మోహన్ రాజా దర్శకత్వంలో ‘గాడ్ ఫాదర్’ సినిమాని రిలీజ్ కు సిద్ధం చేస్తున్నారు. ఒక పాట మినహా షూటింగ్ పూర్తయిన ఈ సినిమాని దసరా పండుగ సందర్భంగా విడుదల చేయనున్నారు. ఈ సినిమా తర్వాత బాబీ దర్శకత్వంలో ‘వాల్తేరు వీరయ్య’(rumoured title) సినిమా చేస్తున్నారు. ఇందులో మాస్ రాజా రవితేజ కూడా మరో ముఖ్యపాత్రలో నటిస్తున్నారు.
ఈ చిత్రంలో రవితేజ నటిస్తున్న విషయం ముందునుంచే వార్తల్లో ఉన్నా.. కోన్ని సార్లు అవునని కొన్ని సార్లు లేరని రకరకాలుగా పుకార్లు షికారు చేశాయి. అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం రవితేజ ఈ సినిమాలో నటించడం దాదాపు ఖాయం అని అంటున్నారు.
హైదరాబాద్ లో వేసిన ప్రైవేట్ సెట్ లో తన పాత్రకు సంభందించిన షూటింగ్ లో రవితేజ పాల్గొంటారని, అలాగే చిరంజీవితో కాంబినేషన్ సీన్స్ కి కూడా డేట్స్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది.
మెగాస్టార్ చిరంజీవి లాగే మాస్ మహరాజ్ రవితేజ కూడా స్వయంకృషితో పరిశ్రమలో ఎదిగారు. మాస్ ప్రేక్షకులలో ఇద్దరికీ మంచి ఆదరణ కూడా ఉంది. ఇక వీరిద్దరూ కలిసి సినిమా చేస్తున్నారు అంటే ఖచ్చితంగా ప్రేక్షకులకి కనువిందు అనే చెప్పాలి.
ఇక రవితేజ నటించిన “రామారావు ఆన్ డ్యూటీ” జూలై 29న విడుదలకు సిద్ధంగా ఉంది.ఈ వారమే ట్రైలర్ కూడా విడుదల కానుంది. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ తరువాత మెహర్ రమేష్ దర్శకత్వంలో “భోళా శంకర్” చేస్తున్నారు. బాబీ తో సినిమాతో పాటు యువ దర్శకుడు వెంకీ కుడుముల తొనూ ఒక సినిమా చేయనున్నారు.