Home సినిమా వార్తలు పాన్ ఇండియా ఫార్ములా అదే అంటున్న రామ్

పాన్ ఇండియా ఫార్ములా అదే అంటున్న రామ్

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పొతినేని నటించిన తాజా సినిమా ‘ది వారియర్‌’. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. లింగుస్వామి డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో రామ్ సరసన కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ఈ సినిమా జులై 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ క్యార్యక్రమాలను కంప్లీట్ చేసుకుంది. సెన్సార్ బోర్డు సభ్యులు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసి 155 నిమిషాల నిడివిని ఖరారు చేసారు. అంటే దాదాపు 2 గంటల 35 నిమిషాల వరకు ది వారియర్ థియేటర్లలో సందడి చేస్తాడు అన్నమాట.

ఇక ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లు, టీజర్, ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ సినిమాలో హీరో రామ్ తొలిసారి పోలీస్ ఆఫీసర్ పాత్ర పవర్‌పుల్‌గా కనిపిస్తున్నారు. ఆది పినిశెట్టి విలన్‌ పాత్రలో నటిస్తున్నారు. ట్రైలర్‌ను బట్టి చూస్తే.. సినిమాలో వీళ్ళ ఇద్దరి మధ్య రసవత్తరమైన పోరు ఉండేలా ఉంది.

ఇక ఈ సినిమాకి ప్రచార కార్యక్రమాలను చిత్ర యూనిట్ గత కొన్ని రోజులుగా జోరుగా సాగుతున్నాయి. ఆ క్రమంలోనే హీరో రామ్ పోతినేని కోన్ని అసక్తికర వ్యాఖ్యలు చేశారు. బాహుబలి సీరీస్,పుష్ప, ఆర్ ఆర్ ఆర్, కేజీఫ్ వంటి సినిమాల తరువాత తెలుగు సినిమాలకు బాలివుడ్ మార్కెట్ కూడా ఏర్పడింది.ఈ విషయంపై హీరో రామ్ ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ.. మనదైన శైలిలో సినిమాలు తీసి వాటిని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయాలి కానీ బాలీవుడ్ ఫార్ములా వైపు పరుగులు తీయడం అంత మంచిది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ది వారియర్ తరువాత రామ్, దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేయనున్నారు. ఆ సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నారు.

ఈ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూ లోనే రామ్ పైన చెప్పిన మాటలు అనడం జరిగింది. రామ్ చెప్పింది అక్షరాలా నిజం. ఎందుకంటే బాలివుడ్ ప్రేక్షకులకు మన సినిమాల్లో ఉండే అంశాలు వాళ్ళకి కొత్తగా అనిపించాయి.. పాటలు, కామెడీ, ఫైట్స్ ఇలా పక్కా ఫార్ములా చిత్రాలు హిందీలో రావడం అరుదు. అందుకే మన సినిమాలకు అక్కడ శాటిలైట్ మరియు థియేట్రికల్ మార్కెట్ పెరిగింది.

అంతే తప్ప హిందీ సినిమాలా అనిపించాలని ప్రయత్నిస్తే ఏం జరుగుతుందో రాదే శ్యాం లాంటి సినిమా ఫలితం తోనే మన ఇండస్ట్రీ వర్గాలకి అర్థం అయి ఉండాలి. కేవలం స్టార్ హీరో – హీరోయిన్లు , మంచి పాటలు,భారీ సెట్టింగ్ లు ఉంటే సినిమాలు ఆడవు. మంచి కథ ఉండీ, దాన్ని అంతే ఆసక్తికరంగా తీర్చిదిద్దితేనే బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశం ఉంటుంది.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version