Home సినిమా వార్తలు నిర్మాతగా మారనున్న సాయి పల్లవి

నిర్మాతగా మారనున్న సాయి పల్లవి

హీరోయిన్ సాయి పల్లవికి ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో చక్కని క్రేజ్ ఏర్పడింది. అనతి కాలంలోనే స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకున్న సాయి పల్లవి.. తనదైన శైలిలో సినిమాలను ఎంచుకుని ముందుకు సాగుతున్నారు. చేసినవి కొన్ని సినిమాలే అయిన కూడా, సాయి పల్లవికి అభిమానులు అధిక సంఖ్యలో ఉన్నారు. ఇక పాత్రల ఎంపికలో ఆమె చూపించే వైవిద్యం.. సినిమాల పట్ల ఆమెకు ఉన్న అంకిత భావం అనేది అభిమానులకు బాగా నచ్చుతుంది.

అదే విధంగా కేవలం డబ్బు కోసమో లేదా హీరోయిన్ రేస్ లో నిలవటం కోసమో ఆమె సినిమాలు చేయరు. తనకి ఆయా పాత్రలు, కథలు నచ్చితేనే సినిమాలు ఒప్పుకుంటారు.ఆమె నటించిన చిత్రాల్లో కొన్ని బాక్స్ ఆఫీస్ వద్ద పరాజయం పాలయినా, సాయి పల్లవి నటనకు మాత్రం ఎప్పుడూ ప్రశంసల వర్షం కురుస్తుంది.

తాజాగా సాయి పల్లవి నటించిన విరాటపార్వం అనే సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోయినా.. ఆ సినిమాలో సాయి పల్లవి నటనకు మాత్రం మంచి పేరు వచ్చింది.ఇక ఇప్పుడు సాయి పల్లవి ముఖ్య పాత్రలో మరో కొత్త సినిమా వస్తుంది.. అదే గార్గి, సాయి పల్లవి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాల ఈ నెల 15న అనేది ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఈ క్రమంలో గార్గి సినిమాకు సంబంధించిన ప్రచార కార్యక్రమాలలో పలు ఇంటర్వ్యూలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో సాయి పల్లవి మాట్లాడుతూ.. నాకు నచ్చి, సరైన కథ అనిపిస్తే అందులో నటించడమే కాదు నిర్మాతగా కూడా మారుతాను అని సాయి పల్లవి తెలిపారు. పరిశ్రమలో హీరోలు నిర్మాతలుగా మారడం కొత్త విషయం ఏమీ కాదు. తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు తాను నటించే చిత్రాల నిర్మాణంలో భాగం అవుతారు. అదే కాకుండా ఇటీవలే అడివి శేష్ హీరోగా “మేజర్” సినిమాని నిర్మించిన సంగతి తెలిసిందే.అలాగే నాచురల్ స్టార్ నాని కూడా తన సొంత నిర్మాణంలో వేరే హీరోలతో చక్కని, వైవిధ్యమైన సినిమాల్ని అందిస్తూ ఉన్నారు. ఇక తమిళంలో సూర్య – జ్యోతిక జంటగా ఎప్పటి నుంచో సినిమాలు నిర్మిస్తున్నారు.

సాయి పల్లవి తాజాగా నటిస్తున్న “గార్గి” చిత్రాన్ని తమిళ భాషలో సూర్య – జ్యోతిక సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు సాయి పల్లవి కూడా సినిమాలు నిర్మించడానికి సిద్ధం అంటున్నారు. అయితే అందుకు ఇంకా కొద్దిగా సమయం పడుతుంది అని సాయి పల్లవి పేర్కొన్నారు. మరి సాయి పల్లవి తన నిర్మాణ సంస్థ ఎప్పుడు మొదలుపెడతారో చూడాలి.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version