Home సినిమా వార్తలు నయనతార – విఘ్నేష్ శివన్ ల వివాహ ఒప్పందాన్ని రద్దు చేసిన నెట్ఫ్లిక్స్ ?

నయనతార – విఘ్నేష్ శివన్ ల వివాహ ఒప్పందాన్ని రద్దు చేసిన నెట్ఫ్లిక్స్ ?

తెలుగు,తమిళ, మలయాళ భాషల్లో నటించి తనదైన శైలిలో ఇమేజ్ ను స్టార్డం ను సంపాదించుకున్నారు నయనతార. ప్రాంతాలకి అతీతంగా ఒక వెలుగు వెలిగిన ఆమె కేవలం ఒక సాధారణ హీరోయిన్ గానే కాదు.. మహిళా ప్రాధాన్యత ఉన్న సినిమాలకు మార్కెట్ తెచ్చిపెట్టిన హీరోయిన్ గా తనకంటూ ఒక స్థాయిని ఏర్పరచుకుని లేడీ సూపర్ స్టార్ గా ఎదిగారు.

ఇక ఇటీవలే నయనతార వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. తమిళ దర్శకుడు విగ్నేష్ శివన్ – నయనతార చాలా కాలంగా ప్రేమించుకుని ఇటీవలే పెళ్లితో ఒక్కటయ్యారు. వీరి పెళ్ళికి సంబంధించిన పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే.

వీరి జంటను ఆశీర్వదించేందుకు అన్ని ఇండస్ట్రీల ప్రముఖులు, బంధు మిత్రులు హాజరయ్యారు.చెన్నై సమీపంలోని మహాబలేశ్వరంలో ఒక ప్రైవేట్ రిసార్ట్ లో వీరి విహహం జరిగింది. ఈ వివాహ వేడుకను తమిళ స్టార్ దర్శకుడు గౌతమ్ మీనన్ ఒక సినిమా తెరకెక్కించిన స్థాయిలో షూట్ చేయడం విశేషం. ఈ పెళ్లి వేడుకకు సంభందించిన ఫోటోలు కానీ వీడియోలు కానీ ఏవీ బయటకు రాలేదు.నయన్, విఘ్నేష్ తో కొంత మంది సినీ ప్రముఖులు దిగిన ఫోటోలు మాత్రమే బయటకు వచ్చాయి.

మిగతా ఫోటోలు, వీడియోలు బయటకి రాలేదు. ఎందుకంటే ఈ పెళ్ళి వేడుక ప్రసార హక్కులను ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ భారీ ధర చెల్లించి కొనుగోలు చేయడమే అందుకు కారణం. అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం ఆ ఒప్పందాన్ని నెట్ఫ్లిక్స్ సంస్థ రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది.

అందుకు నయన్ – విఘ్నేష్ శివన్ లే కారణం అట. వివాహం జరిగి నెల రోజులు అయిన తరువాత దంపతులు కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగింది. అలా ఫోటోలు షేర్ చేయడం నెట్ఫ్లిక్స్ ఒప్పందానికి విరుద్ధం అట. నిభందనలు ఉల్లంఘించిన కారణంగా నెట్ఫ్లిక్స్ తమ ఒప్పందాన్ని రద్దు చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

అయితే ఈ విషయంపై అటు నయనతార దంపతులు కానీ.. నెట్ఫ్లిక్స్ సంస్థ కానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. మరి నిజం ఏదో తెలియాలి అంటే కొద్ది రోజులు ఆగక తప్పదు.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version