Home సినిమా వార్తలు టాలీవుడ్ ని బాలీవుడ్ కలిసిన సందర్భం : విఎఫ్ఎక్స్ మిస్ ఫైర్

టాలీవుడ్ ని బాలీవుడ్ కలిసిన సందర్భం : విఎఫ్ఎక్స్ మిస్ ఫైర్

tollywood

గత కొన్నేళ్లుగా మన తెలుగు సినిమా భారతీయ సినీ చరిత్రను దాటి వరల్డ్ సినిమా స్థాయికి చేరుకుంటూ దూసుకెళుతోంది. ముందుగా కొన్నేళ్ల క్రితం రాజమౌళి తరకెక్కించిన బాహుబలి అనంతరం ఇటీవల వచ్చిన పుష్ప 2 వరకు ప్రతి ఒక్క పాన్ ఇండియన్ సినిమా అత్యద్భుత విజయాలు అందుకుంటూ మన తెలుగువారి కీర్తిని విశ్వవ్యాప్తం చేస్తూ వెళ్తున్నాయి.

ముఖ్యంగా రాజమౌళి తీసిన బాహుబలి సినిమాల్లో కథ కథనాలు బలమైన ఎమోషన్స్ తో పాటు ఆకట్టుకునేటువంటి విజువల్ ఎఫెక్ట్స్ కూడా హాలీవుడ్ వారిని సైతం ఆకట్టుకున్నాయి. ఆ తర్వాత వచ్చిన ఆర్ఆర్ఆర్ ఇక ఇటీవల వచ్చినటువంటి సలార్ అలానే కల్కి 2898 ఏడి, పుష్ప 2 వంటి సినిమాలు కూడా గ్రాండియర్ విజువల్ ఎఫెక్ట్స్ తో తెరకెక్కి అందర్నీ విశేషంగా ఆకట్టుకున్నాయి.

అయితే ఆ విజువల్ ఎఫెక్ట్స్ విషయమై టాలీవుడ్ నటులు బాలీవుడ్ దర్శకులతో సినిమాలు చేస్తున్నపుడు ఒక విషయమై తప్పు మాత్రం దొర్లుతోంది. అదే విజువల్ ఎఫెక్ట్స్ సరిగ్గా లేకపోవడం. ముఖ్యంగా ఇటీవల మన టాలీవుడ్ పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ మూవీని బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించి, ఆ మూవీ పూర్ విజువల్ ఎఫెక్ట్స్ విషయమై తీవ్ర విమర్శలు మూటగట్టుకున్నాడు.

ఇక తాజాగా రిలీజ్ అయిన వార్ 2 మూవీ టీజర్ లో విజువల్ ఎఫెక్ట్స్ విషయమై దర్శకుడు అయాన్ ముఖర్జీ ని ఆడియన్స్ తప్పుపడుతున్నారు. టాలీవుడ్ నటులు తెలుగులో భారీ సినిమాలు చేస్తే ఇక్కడి దర్శకులు ఆ విషయమై ఎంతో శ్రద్ధతో పని చేస్తుంటే అదే నటులు అక్కడి దర్శకులతో సినిమాలు చేస్తున్నప్పుడే విజువల్ ఎఫెక్ట్స్ విషయమై సమస్యలు తలెత్తుతున్నాయి.

టాలీవుడ్ కంటే బాలీవుడ్ మార్కెట్ ఎంతో పెద్దది అనే విషయం తెలిసిందే. మరి ఇకనైనా మన స్టార్స్ తో సినిమాలు తీసే అక్కడి దర్శకులు అన్ని అంశాలతో పాటు కీలకమైన విజువల్ ఎఫెక్ట్స్ విషయమై గట్టి జాగ్రత్తలు తీసుకోవాలని పలువురు నెటిజన్స్ సోషల్ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా అభిప్రాయపడుతూ కామెంట్స్ చేస్తున్నారు.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version