Home సినిమా వార్తలు జపాన్ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ వైపు అడుగులు వేస్తున్న RRR

జపాన్ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ వైపు అడుగులు వేస్తున్న RRR

ఒక సినిమా అన్ని భాషలు మరియు సంస్కృతులలో ప్రశంసలు అందుకోవడంతో పాటు భారీ హిట్ కావడం అనేది అరుదైన విషయం. RRR తో రాజమౌళి అదే పనిని ప్రపంచవ్యాప్తంగా చేసి చూపించారు. ఈ చిత్రానికి పశ్చిమాన అమెరికా నుండి తూర్పున జపాన్ వరకు సరి సమానమైన క్రేజ్ వచ్చింది. జపాన్‌లో, ఇది అతి పెద్ద వసూళ్లను సాధించిన భారతీయ సినిమాల్లో అగ్రస్థానం వైపు పయనిస్తోంది.

ఓపెనింగ్ రోజు కంటే విడుదలైన 21వ రోజు ఈ చిత్రం ఎక్కువ కలెక్షన్స్ సాధించిందని చిత్రబృందం ఈ సందర్భంగా ట్వీట్ చేసింది. ఇది బాక్సాఫీస్ వద్ద RRR యొక్క నానాటికీ పెరుగుతున్న క్రేజ్‌ను సూచిస్తుంది. బ్లాక్‌బస్టర్‌లు అంటే ఇలానే జరుగుతాయి, అవి చాలా కాలం పాటు వార్తలలో నిలుస్తూ ఉంటాయి. RRR అలాంటి అరుదైన ఘనతను సాధించింది.

ఇప్పటి వరకు జపాన్ లో 11 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా ఫైనల్ కలెక్షన్లు 30 కోట్ల వరకు పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. భారతీయ చిత్రాల వరకూ ఇది ఊహించలేని విజయం అని చెప్పవచ్చు. సినిమా టీమ్ జపాన్‌లో RRRని బాగా ప్రమోట్ చేసింది, వారు ప్రమోషన్లను చాలా ముఖ్యమైన విషయంగా పరిగణించారు.

ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ చాలా ఇంటర్వ్యూలు ఇచ్చారు.అంతే కాకుండా జపాన్ లోని లోకల్ పాపులర్ షోలలో కూడా వెళ్ళి పాల్గొన్నారు. ఇక జపనీస్ భాషల్లో మాట్లాడటం ద్వారా ఎన్టీఆర్ ఒక అడుగు ముందుకేశారనే చెప్పాలి. సినిమాని ప్రపంచం నలుమూలలా వ్యాపించేలా చేయడంలో RRR చిత్ర బృందం తమ శక్తికి మించి పని చేశారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఏ భాష సినిమా అయినా సరే ఎమోషన్స్ సరిగ్గా కుదిరితే ఆ సినిమా ప్రపంచవ్యాప్తంగా విజయం సాధిస్తుందని RRR సినిమా కంటెంట్ నిరూపించింది. ఇది సంస్కృతులు మరియు భాషల సమ్మేళనంగా అన్ని దేశాలలో ఒకేలా ఉండే ప్రాథమిక మానవ భావోద్వేగం. ఈ విధంగా, గ్లోబల్ మ్యాప్‌లో యాక్షన్ జానర్‌ను మళ్లీ గొప్పగా మార్చేశారు చిత్ర దర్శకుడు రాజమౌళి.

హాలీవుడ్‌తో సహా అమెరికా వరకు ఇప్పటికే RRR విస్తృత ఆదరణను చూసింది. ఎడ్గార్ రైట్, సీన్ బేకర్, మేరీ హారన్ మొదలైన గొప్ప దర్శకులు ఈ సినిమాను అభినందిచారు. భారతీయ సినిమాలకు మరీ ముఖ్యంగా తెలుగు సినిమాలకు ఇది నిజంగా సంచలనాత్మకమైన మరియు గర్వించదగిన క్షణం అని చెప్పాలి.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version