Home సినిమా వార్తలు చంద్రముఖి-2: రజినీకాంత్ ఆశీస్సులు తీసుకున్న రాఘవ లారెన్స్

చంద్రముఖి-2: రజినీకాంత్ ఆశీస్సులు తీసుకున్న రాఘవ లారెన్స్

సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ హిట్ సినిమాలలో ‘చంద్రముఖి’ కి ప్రత్యెక స్థానం ఉంటుంది. బాబా లాంటి అతి పెద్ద డిజాస్టర్ తరువాత ఆయన కెరీర్ మరియు స్టార్డం ను అందరూ ప్రశ్నించిన సమయంలో.. చాలా లో ప్రొఫైల్ లో మొదలై అంత హైప్ కూడా లేకుండా రిలీజ్ అయి భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సినిమా “చంద్రముఖి”.

హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా తమిళనాటనే కాకుండా తెలుగులో కూడా ఘన విజయం సాధించింది. సూపర్ స్టార్ రజనీకాంత్, జ్యోతిక, నయనతార, ప్రభు ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి పి. వాసు దర్శకత్వం వహించారు. 2005 లో వచ్చిన ఈ చిత్రం కన్నడ “ఆప్తమిత్ర” చిత్రానికి రీమేక్. ఆ తరువాత కన్నడలో ఆ చిత్రానికి సీక్వెల్ కూడా తెరకెక్కింది. తమిళ భాషలోనూ సీక్వెల్ కు ప్రయత్నాలు జరిగినా.. కోన్ని కారణాల వల్ల అది రూపు దాల్చలేదు. అయితే ఆ కన్నడ వెర్షన్ ను తెలుగులో విక్టరీ వెంకటేష్ హీరోగా తెలుగులో “నాగవల్లి” గా తెరకెక్కించారు. ఆ సినిమా అంచనాలను అందుకోలేక పోయినా, బాక్స్ ఆఫీస్ వద్ద పర్వాలేదు అనిపించుకుంది.

అయితే తమిళ భాషలో “చంద్రముఖి” చిత్రానికి ఇప్పుడు సీక్వెల్‌ రానుంది. అయితే ఇందులో రజనీకాంత్ నటించటం లేదు. ఆయన వీరాభిమాని.. డాన్స్ కొరియోగ్రాఫర్ మరియు నటుడు, దర్శకుడు అయిన రాఘవ లారెన్స్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ నిన్నటి నుంచి మైసూర్‌లో మొదలైంది.

అయితే తన గురువు నటించిన సినిమాకు సీక్వెల్ గా రూపొందుతున్న సినిమాలో నటిస్తున్న సందర్భంగా లారెన్స్.. సినిమా రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లబోయే ముందు రజనీకాంత్ ఆశీస్సులు అందుకున్నారు. సోషల్ మీడియాలో రజనీకాంత్‌ను తను కలిసిన ఫోటోలను షేర్ చేస్తూ ‘హాయ్ ఫ్రెండ్స్, ఫ్యాన్స్ చంద్రముఖి 2 షూటింగ్ నా తలైవర్ రజనీకాంత్ ఆశీస్సులతో ప్రారంభమవుతుంది. మీ అందరి ఆదరణ నాకు దక్కాలి’ అని లారెన్స్ ట్విట్టర్ ద్వారా తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. వడివేలు ముఖ్య పాత్ర పోషిస్తున్న ఈ సినిమాకు ఆర్‌డి రాజశేఖర్ కెమెరామేన్ గా, తోట తరణి ప్రొడక్షన్ డిజైనర్ గా వ్యవహరిస్తున్నారు. ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా లైకా ప్రొడక్షన్స్ నిర్మించనుంది.

https://twitter.com/offl_Lawrence/status/1547791027477422087?t=BWc1mEVS9kom_elcNEgFBA&s=19

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version