అక్కినేని వారసుడు అఖిల్ చాలా కాలం నుంచి సక్సెస్ కోసం ఎదరు చూస్తున్నారు. ఇటీవల విడుదలైన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ బాక్స్ ఆఫీస్ వద్ద డీసెంట్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రంలో అఖిల్ నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. ఇక అఖిల్ చేయబోయే తదుపరి చిత్రం ‘ఏజెంట్’ పై అఖిల్ తో పాటు అక్కినేని అభిమానులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు.
స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి వక్కంతం వంశీ కథ అందించగా.. తమిళ యువ సంగీత దర్శకుడు హిప్ హాప్ తమిళ సంగీతం అందిస్తున్నారు.సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తోంది.ఇక ఈ సినిమా లో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్ర పోషించడం విశేషం.
‘‘ఏజెంట్’’ సినిమా కోసం అక్కినేని అఖిల్ మంచి ఫిజిక్ కొరకు చాలా కష్ట పడ్డారు. ఇది వరకే రిలీజ్ అయిన తన లుక్ కి సంభందించిన పిక్ లు చూసి అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఆశ్చర్య పోయారు.ఇవే కాకుండా చిత్రంలో ప్రేక్షకులని అబ్బురపరిచే అంశాలు ఉంటాయని తెలుస్తోంది.
ఇదిలా ఉండగా, ఈ సినిమా టీజర్ ఈరోజు ఒక ప్రత్యేక వేడుకలో విడుదల చేయడం జరిగింది.
టీజర్ చూస్తే సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కించినట్టు స్పష్టంగా కనిపిస్తుంది. కళ్ళు చెదిరే యాక్షన్ ఎపిసోడ్స్ తో దర్శకుడు సురెందర్ రెడ్డి .. హీరో అఖిల్ కనువిందు చేయనున్నారు అని చెప్పవచ్చు. ఇక మలయాళం మెగాస్టార్ మమ్ముట్టి ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. హీరో అఖిల్ గురించి ఎలివేషన్ ఇస్తూ ఆయన చెప్పిన డైలాగులు ఆకట్టుకున్నాయి.