Home సినిమా వార్తలు అఖిల్ తో చిందులేయనున్న చిట్టి

అఖిల్ తో చిందులేయనున్న చిట్టి

హీరో అక్కినేని నాగార్జున తనయుడు అక్కినేని అఖిల్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చిన్ననాటి నుండి ప్రేక్షకులలో అఖిల్ కి చక్కని క్రేజ్ ఉండదు. పసికందుగా ఉన్నప్పుడే సిసింద్రీ సినిమాలో కనిపించి ప్రేక్షకులను అలరించిన అఖిల్.. ఆ తర్వాత మనం సినిమా క్లైమాక్స్ లో కనిపించి తన స్క్రీన్ ప్రెజెన్స్ తో ఔరా అనిపించారు.ఇక వివి వినాయక్ దర్శకత్వం వహించిన అఖిల్ సినిమా ద్వారా హీరోగా పరిచయం అయ్యారు అఖిల్. ఆ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద పరాజయం పాలయింది. ఆ తర్వాత హలో, మిస్టర్ మజ్ను చిత్రాలు కూడా అదే బాట పట్టాయి. అయితే గత ఏడాది దసరాకి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వంటి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా ద్వారా అఖిల్ మొదటిసారి కమర్షియల్ హిట్ అందుకున్నారు.

ఇది ఇలా ఉండగా ప్రస్తుతం అఖిల్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఏజెంట్’ సినిమాలో నటిస్తున్నారు అఖిల్. ఈ సినిమాలో అఖిల్ కి జోడిగా సాక్షీ వైద్య నటిస్తున్నారు.. ఆమెకు ఇది తొలి సినిమా. అయితే ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి ఒక కొత్త వార్త సినీ వర్గాలలో షికారు చేస్తుంది.

ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం అఖిల్ నటిస్తున్న ‘ఏజెంట్’ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ఉండబోతుందని తెలుస్తుంది. ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం ఎంతోమంది హీరోయిన్లను పరిశీలించారట.అయితే మొత్తనికి ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం జాతి రత్నాలు సినిమా హీరోయిన్ ఫరియా అబ్దుల్లా ని ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది. ఇదివరకే నాగార్జున, నాగచైతన్య తో కలిసి బంగార్రాజు సినిమాలో స్టెప్పులేసిన ఫరియా ఇప్పుడు అఖిల్ తో కలిసి చిందులేయనున్నారు.

అయితే ఈ విషయాన్ని చిత్ర బృందం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అఖిల్ ఈ సినిమా కోసం భారీగా కసరత్తులు చేసి కండలు పెంచారు. ఈ సినిమాలో కీలక పాత్రలో మలయాళీ స్టార్ మమ్ముట్టి కనిపించనున్నారు. అలాగే ఈ సినిమాని ముందు ఆగస్టులో విడుదల చేయాలని భావించినా, కోన్ని కారణాల వల్ల వాయిదా పడింది. దసరా లేదా దీపావళి పండుగ లకు రిలీజ్ అవుతుంది అని పుకార్లు వచ్చినా ఇంకా ఏదీ చిత్ర యూనిట్ చేత ధృవికరించ బడలేదు. ఇదిలా ఉండగా ఈ చిత్రం తాలూకు టీజర్ ను జులు 15న విడుదల చేస్తున్నారు.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version