Home సినిమా వార్తలు అక్డి పక్డి అదుర్స్: దుమ్మురేపిన లైగర్ కొత్త పాట

అక్డి పక్డి అదుర్స్: దుమ్మురేపిన లైగర్ కొత్త పాట

రౌడీ హీరో విజయ్ దేవరకొండ, క్రేజీ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ రాబోతున్న సినిమా ‘లైగర్’. ఆగస్టు 25న విడుదల అవుతున్న ఈ సినిమాకి తాజాగా ఈ చిత్ర బృందం ప్రచార కార్యక్రమాలను మొదలు పెట్టారు. అందులో భాగంగా ‘లైగర్’ ఫస్ట్ సింగల్ గా ‘అక్డీ పక్డీ’ పాటను 11న రిలీజ్ చేయబోతున్నారని ఇదివరకే ప్రోమో ను విడుదల చేశారు.ఈ పార్టీ సాంగ్ పెప్పీ నంబర్ గా ఉండబోతోందని పబ్ సెట్ చూస్తే అర్థమౌతోంది.

ఇక ఈరోజు విడుదలైన ఈ పాటలో విజయ్, అనన్య ఫుల్ మాస్ స్టెప్పులతో అదరగొట్టారు. మంచి హుషారైన బీట్ తో ఉన్న ఈ పాట పక్కా మాస్ టచ్ తో ప్రేక్షకులను ఉర్రూతలూగించేలా ఉంది.మామూలుగానే పూరి సినిమాలో హీరో పాత్ర చిత్రణ, రోమాన్స్ ట్రాక్ మరియు పాటలు అన్నీ యూత్ ప్రేక్షకులతో పాటు మాస్ ప్రేక్షకులకి కూడా నచ్చేలా తీస్తారు. ఇప్పుడు లైగర్ చిత్రం కూడా అదే కోవలోకి చేరేలా ఉంది.

లిజో జార్జ్-డిజె చేతాస్ ఈ పాటను స్వరపరచగా, హుక్‌లైన్ ను సునీల్ కశ్యప్ సమకూర్చారు. అజీమ్ దయాని మ్యూజిక్ ని సూపర్ వైజ్ చేశారు. దేవ్ నేగి, పావ్నీ పాండే, లిజో జార్జ్ ఈ పాట హిందీ వెర్షన్‌ను పాడారు. ఈ పాటకు మొహ్సిన్ షేక్, అజీమ్ దయాని సాహిత్యం అందించారు.తెలుగులో అనురాగ్ కులకర్ణి, రమ్య బెహరా ఆలపించగా, భాస్కరభట్ల రవికుమార్ సాహిత్యాన్ని అందించారు.

ఈ పాట తమిళ వెర్షన్‌ కు సాగర్ సాహిత్యం అందించగా వైష్ణవి కొవ్వూరి, సాగర్ కలసి పాడారు. విష్ణు వర్ధన్, శ్యామ మలయాళ వెర్షన్ ని ఆలపించగా, సిజు తురవూర్ సాహిత్యం అందించారు. వరదరాజ్ చిక్కబళ్లాపుర రాసిన ఈ పాట కన్నడ వెర్షన్‌ ని సంతోష్ వెంకీ, సంగీత రవిచంద్రనాథ్‌ ఆలపించారు. సాగర్ సౌత్ మ్యూజిక్ అడ్మినిస్ట్రేటర్ గా వున్నారు. ఒకేసారి ఈ ఐదు వర్షన్స్ పాటనూ విడుదల చేసి, సినిమా మీద క్రేజ్ ను స్కై లెవల్ కు తీసుకెళ్ళాలన్న పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా ఆలోచన పని చేసినట్టు గానే కనిపిస్తుంది.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version