Homeసినిమా వార్తలువరుస విజయాలతో దూసుకుపోతున్న యువ హీరో కిరణ్ అబ్బవరం

వరుస విజయాలతో దూసుకుపోతున్న యువ హీరో కిరణ్ అబ్బవరం

- Advertisement -

ఇటీవలి కాలంలో తెలుగు సినీ పరిశ్రమలో ఎదుగుతున్న హీరోల్లో కిరణ్ అబ్బవరం ఒకడు.యూత్ ను ఆకట్టుకునేలా పాటలు,డైలాగ్స్, క్యారక్టరైజేషన్ ఉండేలా చూసుకుంటూ వరుస సినిమాలే కాదు వరుస విజయాలతో కూడా అతను దూసుకుపోతున్నాడు. ఇటీవల సమ్మతమే సినిమాతో బాక్సాఫీస్ వద్ద మరో హిట్ అందుకొని తనేంటో మరోసారి నిరూపించుకున్నాడు.

ఈ విజయంతో కిరణ్ అబ్బవరం కూడా మిడియం రేంజ్ హీరో అంటే టైర్ 2 లిస్ట్ లో చాలా తొందరగా చేరిపోయేలా ఉన్నాడు.ఇప్పటివరకు కిరణ్ నాలుగు సినిమాలు చేయగా,అందులో మూడు సినిమాలు హిట్ అవ్వడం విశేషం.

రాజావారు రాణిగారు – హిట్

SR కళ్యాణమండపం – బ్లాక్ బస్టర్ సెబాస్టియన్ – ఫ్లాఫ్ సమ్మతమే – బ్లాక్ బస్టర్

ఇక 2022 అంటే ఈ సంవత్సరంలో ఇప్పటికే రెండు సినిమాలు విడుదల చేసిన కిరణ్ మరిన్ని ఆసక్తికరమైన సినిమాలను సిద్ధం చేసాడుఇక కోడి దివ్య ప్రొడక్షన్ లో నేను “మీకు బాగా కావాల్సిన వాడిని “ఆగస్ట్ 18న విడుదల కానుంది. ఆ తరువాత “వినరో భాగ్యము విష్ణు కథ” సినిమా గీతా ఆర్ట్స్ సారథ్యంలో సెప్టెంబర్ 30న రాబోతోంది.

READ  777 చార్లీ చిత్రం చూసి కంటతడి పెట్టుకున్న కర్ణాటక ముఖ్యమంత్రి

ఇవి కాకుండా మైత్రి మూవీ మేకర్స్ మరియు క్లాప్ బోర్డ్ సంయుక్తంగా నిర్మిస్తున్న మరో సినిమా డిసెంబర్ లో రానుంది.2023లో రాబోయే సినిమాలు:ఎమ్ రత్నం బ్యానర్ లో “రూల్స్ రంజన్” అనే సినిమాతో పాటు ఏషియన్ సినిమాస్ లో కూడా ఒక సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ లో కూడా కిరణ్ మొదటిసారి ఒక బిగ్ బడ్జెట్ సినిమా చేయబోతున్నాడు. అలాగే మరొక న్యూ ప్రొడక్షన్ హౌస్ లో కాలేజ్ బ్యాక్ డ్రాప్ సినిమాకు కూడా కమిట్మెంట్ ఇచ్చినట్టు సమాచారం. ఆ సినిమా కూడా భారీ బడ్జెట్ తో రానుందట. మొత్తంగా 2023లో కిరణ్ నాలుగు సినిమాలని విడుదల చేయబోతున్నాడు.

ఈ వివరాలన్నీ చూస్తుంటే కిరణ్ ఆబ్బవరం ఆసక్తికరమైన ప్రాజెక్ట్ లను పట్టేసినట్లు అనిపిస్తోంది. కెరీర్ మొదట్లోనే వరుసగా హిట్స్ కొడుతూ, మంచి లైనప్ తో ముందుకు సాగుతున్న ఈ టాలెంటెడ్ హీరో టైర్ 2 రేంజ్ కు వెళ్ళడానికి ఎంతో సమయం పట్టెలా లేదని చెప్పవచ్చు.

READ  అఖిల్ అక్కినేని ఏజెంట్ టీజర్ అదుర్స్ అంటున్న టీమ్

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories