మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ ఆగస్టు 11న విడుదల కాబోతుందన్న విషయం తెలిసిందే. కాగా తెలుగు, హిందీ, తమిళ భాషల నుండి చిన్న సినిమాలు మరియు పెద్ద సినిమాల నుండి ఈ సీన్స్ తీవ్రమైన పోటీని ఎదుర్కోబోతుంది. ఇది ఈ సినిమా బాక్సాఫీస్ పనితీరుపై ప్రభావం చూపుతుందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.
సిద్ధు జొన్నలగడ్డ డీజే టిల్లు 2, సందీప్ వంగా రెడ్డి, రణబీర్ కపూర్ మోస్ట్ హైప్డ్ యానిమల్ దిజస్ కూడా అదే వారాంతంలో విడుదలవుతున్నాయి. ఇక సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ సినిమాను కూడా ఆగష్టు 10న రిలీజ్ చేసే ఆలోచనలో చిత్ర బృందం ఉంది. తొలుత ఈ చిత్రాన్ని సమ్మర్ లో విడుదల చేయాలని అనుకున్నారు కానీ షూటింగ్ లో కాస్త జాప్యం జరగడంతో వాయిదా పడింది.
రజినీకాంత్ తెలుగులో పెద్ద స్టార్ అయినప్పటికీ ఇటీవల ఆయన సినిమాల ఫలితాలు ఆయన తెలుగు మార్కెట్ పై తీవ్ర ప్రభావం చూపాయి. అయితే స్ట్రాంగ్ కంటెంట్ తో గనక ఆయన రీఎంట్రీ ఇస్తే అది ఖచ్చితంగా చిరంజీవి సినిమా పై ప్రభావం చూపే అవకాశం ఉందని అంటున్నారు. అలాగే డీజే టిల్లు 2, యానిమల్ చిత్రాలకు కూడా తెలుగు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉండటంతో ఈ సినిమాలన్నింటితో పోటీ పడటం భోళా శంకర్ కు అంత సులువైన పని కాదనే చెప్పాలి.
అయితే మెగాస్టార్ చిరంజీవికి పోటీలో సినిమాలు విడుదల చేసి విజయం సాధించడం కొత్తేమీ కాదు. ఇప్పటికే ఇతర హీరోలతో పోటీ పడి ఖైదీ నెంబర్ 150 (2017), వాల్తేరు వీరయ్య (2023) వంటి భారీ హిట్స్ అందుకున్నారు. కాబట్టి రజినీకాంత్ లాంటి సూపర్ స్టార్ ను ఎదుర్కొన్నప్పటికీ మంచి టాక్ వస్తే తన సినిమా హిట్ అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.