Homeసినిమా వార్తలుPonniyin Selvan 2: పొన్నియిన్ సెల్వన్ 2 ఫస్ట్ పార్ట్ కలెక్షన్లను బ్రేక్ చేస్తుందా?

Ponniyin Selvan 2: పొన్నియిన్ సెల్వన్ 2 ఫస్ట్ పార్ట్ కలెక్షన్లను బ్రేక్ చేస్తుందా?

- Advertisement -

లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నియిన్ సెల్వన్ 1 తమిళంలో అన్ని రికార్డులను బద్దలు కొట్టి తమిళ సినిమాలలో ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. తమిళ ప్రేక్షకులు ఈ సినిమాను గర్వంగా తీసుకుని థియేటర్లలో చూడాలని ఎంతో ఆత్రుతగా ఉండి, గత ఏడాది సెప్టెంబర్ 30న ఈ సినిమా విడుదలైనప్పుడు ఈ సినిమాను భారీ విజయం సాధించేలా చేశారు.

అయితే ఇతర భాషల్లో ఈ సినిమా ఇంకా బాగా చేసి ఉంటే బాగుండేదని చాలా మంది ప్రేక్షకులు అభిప్రాయపడ్డారు. పొన్నియిన్ సెల్వన్ చిత్రం డీసెంట్ బజ్ తో విడుదలైనా ఇతర భాషల్లో మిక్స్ డ్ టాక్ తెచ్చుకోవడంతో పాటు పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోవడం ఇప్పుడు రెండో భాగం పై ప్రభావం చూపుతోంది.

ఇప్పుడు పొన్నియిన్ సెల్వన్ 2 ఏప్రిల్ 28న విడుదల కానుంది. ఇటీవలే రిలీజైన ట్రైలర్ ఇతర భాషల్లో బజ్ క్రియేట్ చేయడంలో విఫలం అవ్వడంతో పాటు తమిళ భాషలో కూడా ఈ చిత్రానికి పెద్దగా క్రేజ్ లేదన్నట్లుగా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ సినిమా ఫస్ట్ పార్ట్ కలెక్షన్స్ క్రాస్ చేస్తుందా లేదా అనేది అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న.

READ  Nani - Trivikram: నాని, త్రివిక్రమ్ ఓ సినిమా కోసం చేతులు కలపనున్నారా?

సాధారణంగా మొదటి భాగం కంటే సీక్వెల్స్ భారీ రేంజ్ లో కలెక్ట్ చేస్తాయి కానీ పీఎస్ 2 సినిమాకు అంత భారీ క్రేజ్ లేదు. ప్రస్తుతానికి ఈ సినిమాకు చాలా తక్కువ బజ్ ఉంది కాబట్టి ఫస్ట్ పార్ట్ కలెక్షన్స్ ని క్రాస్ చేస్తుందో లేదో తెలియాలంటే విడుదలయ్యే వరకూ వెయిట్ చేయాల్సిందే.

విక్రమ్, కార్తీ, ఐశ్వర్యారాయ్ బచ్చన్, త్రిష, జయం రవి వంటి భారీ తారాగణం ఈ చిత్రంలో నటించారు. అశ్విన్ కాకుమాను, ఐశ్వర్య లక్ష్మి, శోభితా ధూళిపాళ, శరత్ కుమార్, ప్రభు, విక్రమ్ ప్రభు, జయరామ్, ప్రకాష్ రాజ్, పార్తిబన్, లాల్, మోహన్ రామన్ తదితరులు నటించారు. లైకా ప్రొడక్షన్స్ తో కలిసి మద్రాస్ టాకీస్ నిర్మించిన పొన్నియిన్ సెల్వన్ 2 ఏప్రిల్ 28న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

ఈ చిత్రానికి సంగీతం: ఎ.ఆర్.రెహమాన్, సినిమాటోగ్రఫీ: రవివర్మన్, ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్, ప్రొడక్షన్ డిజైన్: తోట తరణి, మాటలు: జయమోహన్, కాస్ట్యూమ్స్: ఏకా లఖానీ, మేకప్: విక్రమ్ గైక్వాడ్, కొరియోగ్రఫీ : బృందా

Follow on Google News Follow on Whatsapp

READ  Ponniyin Selvan 2: ట్రైలర్ ఏ ఇతర భాషల్లో పొన్నియిన్ సెల్వన్ 2 రేంజ్ ను డిసైడ్ చేస్తుంది


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories